కరోనా తో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే కొంతమందిలో మాత్రం ఇమ్యూనిటీపవర్ తక్కువగా ఉండటం వల్ల పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల బరువు పెరుగుతారనే విషయంలో ఆహారం తగ్గిస్తూ ఉంటారు. అలా తగ్గించడం వల్ల వారికి ఇమ్యూనిటీపవర్ తగ్గి  తొందరగా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వారు ఎలాంటి సమయంలో ఎలాంటి భోజనం చేస్తే మంచిదో  నిపుణులు కొన్ని సూచనలు తెలియజేశారు. అయితే అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1). ఉదయం లేచిన అరగంటలోపే ఏదో ఒకటి తినాలి. రెండు కర్జూరాలు, నానబెట్టిన గింజలు, ఒక గుడ్డు తింటే చాలు.. ఇక అల్పాహారం అక్కర్లేదు. లేదంటే ఒక గ్లాస్ పాలు, కొన్ని బాదం గింజలు, రెండు ఇడ్లీలు తీసుకుంటే రోజంతా చురుగ్గా పని చేయగలరు.

2). అల్పాహారానికి,భోజనానికి మధ్య ఆకలేస్తే ఒక గ్లాసు పండ్లరసం తాగడం మంచిదట.

3). మధ్యాహ్నం భోజనం సమయంలో  బఠాణీలు, బీన్స్, ఆకుకూరలు, కాయగూరలు, పప్పు,పెరుగు వంటివి ఉండేలా చూసుకోవాలి.

4). నట్స్ లో ఎక్కువగా పోషకాలు ఉండడంవల్ల అవి మన శరీరానికి అందుతాయి. ఎప్పుడైనా భోజనం చేసే తీరిక లేకపోతే.. 5 నానబెట్టిన బాదం గింజలు, పండ్ల ముక్కలు కొన్ని, బర్ఫీ లు తినడం వల్ల మనకి కడుపు నిండుతుంది. దీంతో అవసరమైన శక్తి లభిస్తుంది.

5). రాత్రులు తేలిగ్గా ఉండే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అందులో ముఖ్యంగా చపాతి, ఒక కప్పు అన్నం, కూర వంటివి చాలు. మసాలాలు, మాంసాహారం వంటివి ఈ వేళలో సాధ్యమైనంతవరకు తక్కువగా తినాలి. మసాలా వంటివి  రాత్రులు తినడం వల్ల అవి సరిగా జీర్ణం కావు.

6). రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే,  శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. దీనివల్ల మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

చూశారు కదా !  అమ్మాయిలు మీరు , మీలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే తప్పకుండా వీటిని తినాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: