ప్రస్తుత దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత విలయ తాండవం చేస్తుంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో ఈ మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రత భారత్ లో అధికంగా కనిపిస్తుంది. ఓ వైపు కోవిడ్ విజృంబిస్తుంటే మరో వైపు ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా వేదిస్తుంది. దీంతో ప్రజలు ఈ మహమ్మారి బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నీ రకాల చర్యలు చేపడుతున్నాయి. 

ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మన దేశంలో తయారైన కోవాగ్జిన్, కోవాషీల్డ్ వంటి టీకా లతో పాటు రష్యా తయారు చేసిన స్పుత్నిక్ -వి టీకాను కూడా దేశంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ టీకాలలో దేశీయ టీకా అయిన కోవాగ్జిన్ కరోనా వైరస్ పై ప్రభావంతంగా పని చేస్తుందని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. కరోనా కు సంబంధించిన అన్నీ రకాల స్ట్రెయిన్ లపైనా కోవాగ్జిన్ ప్రభావంతంగా పని చేస్తుందని టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ తెలిపింది. 

ఇండియా, బ్రిటన్, మరియు ఇతర దేశాలలో వ్యాపించిన కోవిడ్ వేరియంట్లను కోవాగ్జిన్ టీకా సమర్థంగా అదుపు చెయ్యగలుగుతుందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. భారత్, బ్రిటన్ లలోని కోవిడ్ వేరియంట్లపై కోవాగ్జిన్ తో ప్రయోగం చేసినప్పుడు బి1, 617, వంటి కోవిడ్ వైరస్ ల శక్తి 1.95 వరకు తగ్గినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇక కోవాగ్జిన్ సాధించిన ఫలితాలపై భారత్ బయోటెక్ కో- ఫౌండర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొత్త రకం స్ట్రెయిన్ నుంచి .. కోవాగ్జిన్ రక్షణ కల్పిస్తుందని సైంటిఫిక్ రీసెర్చ్ డేటా పబ్లిష్ కావడం వల్ల కోవాగ్జిన్ కు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని, ఇది నిజంగా చాలా గొప్ప విషయమని ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: