ప్రతి ఇంట్లో వుండే గోల ఎలుకల గోల.. దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇక ఈ ఎలుకలు ఇంట్లో మూలల్లో నక్కి ఇల్లు మొత్తాన్ని నాశనం చేస్తుంటాయి.ఇక ఎలుకల వ్యర్థాల నుంచి వచ్చే వాసన భరించలేనంత కంపు కొడుతుంది.ఇక పొరపాటున ఒక ఎలుక చచ్చిపోయిదా.. ఆ కంపుకి కడుపులోని పేగులు బయటకు రావడం ఖాయం.వీటివల్ల అనేక రోగాలు కూడా వస్తాయి.ఇక ఈ ఎలుకలను ఇంటి నుంచి తరిమికొట్టడం ఎలానో తెలుసుకోండి.ఇక ఎలుకలను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు చాలా మార్గాలు ఉన్నాయి.ఇక మార్కెట్లో ఎలుకలను వెళ్లగొట్టేందుకు మందు దొరుకుతుంది. అలాగే పెస్ట్ కంట్రోల్ మందులు కూడా ఎలుకల మీద స్ప్రే చేయవచ్చు. ఐతే ఇవన్నీ ప్రమాదకర రసాయనాలు. వీటితో మన హెల్త్ కూడా దెబ్బతినే ప్రమాదముంది. అందుకే ఇంట్లో దొరికే సహజసిద్ధమై పదార్థాలతో ఎలుకలను తరిమేస్తే వాటి బెడద అనేది ఉండదు.


ఒక దూదిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఆ ఉండలని పెప్పర్‌మింట్ ఆయిల్‌లో ముంచాలి. ఇక వాటిని ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి. ఇక దెబ్బకి ఆ పిప్పర్‌మెంట్ ఆయిల్ వాసన పడక ఎలుకలు ఇంటి నుంచి పారిపోతాయి.ఇక మన వంటింట్లో దొరికే లవంగాల నుంచి వచ్చే ఘాటైన వాసన కూడా ఎలుకలను ఇబ్బంది పెట్టి వాటిని తరిమి కొడుతోంది. అందుకే ఒక గుడ్డలో కొన్ని లవంగాలు వేసి ఇంటి మూలల్లో ఉంచాలి. ఇక రోజు ఇలా చేస్తే ఎలుకలు పారిపోతాయి.ఇక సహజసిద్ధమైన మంచి ఎలుకల మందు ఏదైనా ఉందా అంటే అది కారం అనే చెప్పాలి. ఇక మన ఇంట్లో అప్పుడప్పుడూ ఎండుమిర్చిలను కాల్చాలి. ఆ ఎండు మిర్చీల ఘాటు పడక ఎలుకలు పారిపోతాయి. ఒక గుడ్డలో కారం పొడి వేసి అక్కడక్కడా ఉంచాలి. ఇలా చేస్తే ఎలుకలతో పాటు చీమలు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు అన్ని పారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: