షుగర్ వ్యాధితో చాలా బాధ పడుతున్నారా..? అయితే మీకోసం కొన్ని చక్కటి ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని కనుక మీరు క్రమం తప్పకుండా పాటించారంటే ఖచ్చితంగా  షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవడానికి వీలవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చక్కటి ఇంటి చిట్కాలు గురించి తెలుసుకోండి.షుగర్ వ్యాధి ఉండే వాళ్ళు తప్పనిసరిగా ఆహార విషయంలో తగినన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే అనేక ప్రాబ్లెమ్స్ కి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇలా పాలు తాగడం వల్ల మంచి లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.


పాలల్లో దాల్చిన చెక్క వేసుకుని తాగడం వల్ల డయాబెటిస్ పేషెంట్లు కి మేలు కలుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. పాలు ఇంకా దాల్చిన చెక్కలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్స్ ఉన్నాయి. అదే విధంగా ఇందులో బీటా-కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ వంటి గుణాలు కూడా ఉన్నాయి. పాలల్లో కొద్దిగా దాల్చినచెక్క వేసుకుని రోజు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.


ఇక పాలల్లో బాదం వేసుకుని తాగండి. లేదా అంటే మార్కెట్లో దొరికే బాదం పౌడర్ ని తీసుకుని బాదం పాలు చేసుకోవచ్చు. వీటిలో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా అలాగే వీటిలో విటమిన్ డి ఇంకా విటమిన్ ఈ కూడా ఉంటాయి. ఇంకా ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడా ఉంటాయి. దీనిని క్రమంగా రోజు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండి షుగర్ తగ్గుతుంది.


పసుపు పాలు కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.పసుపు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో బాగా తెలుసుఅందుకే పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వల్ల డయాబెటిస్ పేషంట్స్ కి చాలా మేలు కలుగుతుంది.కాబట్టి రోజు పసుపు పాలు తాగండి. షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: