క‌రోనా థ‌ర్డ్‌వేవ్ హెచ్చ‌రికల నేప‌థ్యంలో ముందుగానే ఏపీ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. థ‌ర్డ్‌వేవ్‌ని ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక సిద్దం చేస్తుంది. ఈ రోజు మంగ‌ళ‌గిరి ఏపీఐఐసీ భ‌వ‌నంలో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్ స‌మావేశం జ‌రిగింది.చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్న‌ట్లు మంత్రి ఆళ్ల‌నాని తెలిపారు.జనావాసాలకు దగ్గరిగా ఉండేలా హెల్త్ హాబ్ లు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశాల‌ను అధికారుల‌కు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రులు నిర్ణ‌యించారు.


వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత వేగవంతం చేయాలన్నారు.థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రులు ఆదేశించారు.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.థర్డ్ వేవ్ లో అవసరమైన అన్ని రకాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలని....అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాల‌న్నారు.బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని మంత్ర‌లు అధికారుల‌ను ఆదేశించారు.కరోనా కేసులు తగ్గు ముఖం పట్టిన అప్రమత్తంగా ఉండాలని మంత్రుల క‌మిటీ సూచించింది.చిన్న పిల్లలుకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామ‌ని మంత్రులు తెలిపారు.

క‌రోనా రెండ‌వ ద‌శ‌లో ఏపీ కేసులు రోజుకి 12 వేల‌కు పైగా న‌మోద‌వుతూ వ‌చ్చాయి.ఏ ఆసుప‌త్రిలో చూసిన నో బెడ్స్ అంటూ బోర్డులు పెట్టిన దృశ్యాలే క‌నిపించాయి. రెండ‌వ ద‌శ‌లో ప్ర‌ధానంగా ఆక్సిజ‌న్ స‌మ‌స్య తీవ్రంగా ఏర్ప‌డింది.ప్రభుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింద‌ని విమ‌ర్శ‌లు సైతం వ‌చ్చాయి. అయితే చాలా రోజుల త‌రువాత ఆక్సిజ‌న్ కొర‌త‌ను ఏపీ ప్ర‌భుత్వం అధిగ‌మించింది. మూడ‌వ ద‌శ‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ముందుగానే ప్రణాళిక‌లు సిద్దం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: