ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడు తుంది.. రోజు రోజుకు ఎన్నో కొత్త ఆవిష్కరణలు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. శాస్త్ర వేత్తలు ఎప్పటికప్పుడు మానవాళికి సరికొత్త టెక్నాలజీ తో కూడిన ఆవిష్కరణలను అందజేస్తూ ఉన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త వస్తువులను కను గొన్నారు.  ఇక ఇటీవలే అమెరికా శాస్త్రవేత్తలు మరో వినూత్న ఆవిష్కరణకు ఆజ్యం పోసారు. ఇప్పటి వరకు హెల్మెట్ అంటే కేవలం బైక్ పై వెళ్లే వాహన దారులు మాత్రమే పెట్టు కునేవారు .



 ద్విచక్ర వాహనం పై వెళ్తున్న సమయం లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇక తలకి బలమైన గాయం అవకుండా ఉండడానికి.. ప్రాణా పాయం నుంచి బయట పడడానికి ఎక్కువ మంది హెల్మెట్ వాడుతూ ఉండేవారు. ఇప్పటి వరకు హెల్మెట్ అంటే ప్రతి ఒక్కరికి ఇది మాత్రమే తెలుసు. కానీ అమెరికా శాస్త్ర వేత్తలు కనుగొన్న హెల్మెట్లు మాత్రం అంతకు మించి అనే రేంజ్ లో పని చేస్తుందట. ఏకంగా మెదడు లో ఉన్న మొత్తం చదివేస్తుందట హెల్మెట్. మెదడు లోని ఆలోచనలను కూడా పూర్తిగా చదివేస్తుందట.



 అమెరికా కు చెందిన కెర్నల్ అనే సంస్థ సరికొత్త హెల్మెట్ ను కనుగొన్నది. ఇక ఈ హెల్మెట్ ఒక్కసారి తలపై పెట్టు కున్నారూ అంటే మెదడును చదివేస్తుందట. ఇక ఈ సరికొత్త ఆవిష్కరణలు వారం రోజుల లోపల కస్టమర్లకు పంప నున్నట్లు తెలుస్తోంది. 50 వేల డాలర్ల విలువ చేసే హెల్మెట్ మెదడును, ఆలోచనల వేగాన్ని, మెదడు సంకేతానికి అటు మిగతా అవయవాలు పని చేస్తున్న తీరును తెలియజేస్తుందట. మెదడును  అంచనా వేయగల ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు ఇందులో అమర్చారట శాస్త్ర వేత్తలు. అయితే ప్రస్తుత టెక్నాలజీ రంగం లో ఇక ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: