కోవిద్ -19 డెల్టా వేరియంటుతో ప్రపంచ దేశాల్లో వణుకు.. !

 కరోనా  దీని పేరు వింటేనే ప్రతి ఒక్కరి మనసులో ఆందోళన మొదలవుతుంది. దీని బారిన పడి ఎంతో మంది జీవితాలు చెల్లాచెదురయ్యాయి. పిల్లలు తల్లిదండ్రులను,  తల్లిదండ్రులు పిల్లలను, దూరం చేసింది ఈ మహమ్మారి. ఈ విధంగా కొత్త కొత్త మార్పులు చెందుతూ కరోనా మానవ సమాజంపై దాడి చేస్తూనే ఉంది.  ప్రస్తుతం కోవిద్-19 డెల్టా వేరియంట్ బి.1.617.2  ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్ మొట్టమొదటిగా భారత దేశంలో వెలుగుచూసింది. దీంతో యునైటెడ్ కింగ్డమ్  మూడో దశ కరోనాతో అల్లాడుతోంది. ఆంక్షల సడలింపు వాయిదా వేసుకుంది. అలాగే ఇండోనేషియా,  రష్యాలో కూడా  డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. అయితే ఇది ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిందని డబ్ల్యూహెచ్ఓ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.  ఆమె కరోనాపై వారాంతపు నివేదికను విడుదల చేసింది.

80 దేశాల్లో ఇప్పటికే ఈ కేసులు వచ్చాయని,  ఇంకా 12 దేశాల్లో డెల్టా కేసులు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. వారం పది రోజుల్లోనే యూకేలో డెల్టా వేరియంట్ కేసులు    30630  వెలుగు చూశాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వెల్లడించిన ప్రకారం డబ్ల్యూహెచ్ఓ కూడా దీనిని ప్రమాదంగా భావించి తన వారంతపు నివేదికలో పొందుపరచినది.  మాస్కోలో రోజుకు 9500 కేసులు వస్తున్నాయి.  రష్యాలో కరోనా ముప్పు తొలగిపోయిందని భావించిన సమయంలో డెల్టా వేరియంట్ విజృంభణతో  రాజధాని మాస్కోలో తొమ్మిది వేల ఐదు వందల కేసులు శుక్రవారం ఒక్క రోజే నమోదయ్యాయి.  దీనిలో 90% డెల్టా వేరియంట్ కేసులేనని మేయర్ శోబ్ యానిన్  తెలిపారు.  గత 12 రోజుల నుంచి కేసులు పెరుగుతున్నాయని అన్నారు.


రష్యాలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ 9.9% జనానికి మాత్రమే ఇప్పటి వరకు వ్యాక్సిన్ పూర్తయిందని అన్నారు.   ఈ వైరస్ మరింత విస్తరించకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని  ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే అమెరికాను కూడా డెల్టా వేరియంట్ భయపెడుతోంది. ముఖ్యంగా అక్కడున్న యువతలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ చాలా భయానకమైనదని అమెరికా అధ్యక్షుడు జో  బైడెన్ అన్నారు. దీని ప్రభావం యువతలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడానికి యువత ముందుకు వచ్చి,  వైరస్ కట్టడికి అడ్డుకట్ట వేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: