ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాటు ఉంటుంది. అలవాట్లు  మనకు మంచిది కాదన్నా కానీ వారు మానుకోలేకపోతారు. కొంతమందికి కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం, కొంతమంది వేళ్ళను లాక్కోవడం , కొంత మంది చేతులు ఊపడం ఇలా రకరకాల అలవాట్లతో వారు ఉంటారు. అయితే ఈ చర్య అనేది వారికి తెలియకుండానే జరుగుతుంది. దీనిపై వారు ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే ఎక్కువగా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం అనేది  మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.  ఇది చాలా ప్రమాదకరమని  ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ కాలు ఊపడానికి కొన్ని లక్షణాలు ప్రభావితం చేస్తాయని అంటున్నారు డాక్టర్లు. వీటిలో  ఆందోళన, అధిక ఒత్తిడి ఈ కాళ్లు ఉపేందుకు కారణాలు అవుతాయి.

 దీంతోపాటుగా  సరిగా నిద్ర లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా  చాలా మందిలో ఈ సమస్య వస్తుంది. నిద్రలేమితో బాధపడే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ అలవాటును మనం ఏవిధంగా అదుపులో పెట్టుకోవాలి అనేది చాలా మందిలో ప్రశ్నల వెంటాడుతోంది. అయితే మనం సరైన సమయానికి ఐరన్   టాబ్లెట్ వేసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. వీటితో పాటుగా  బీట్ రూట్, క్యారెట్, అరటి పండ్లు వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


వీటితో పాటుగా కాఫీ, టి, వంటివి కూడా తాగడం మంచిదని అంటున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా  ఎక్కువసేపు ఫోన్లు వాడడం, టీవీలు చూడటం వంటి  అలవాట్లను తగ్గించుకుంటే ఈ సమస్యను తగ్గించుకునే అవకాశం ఉంటుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అయితే మనం ఎక్కువగా ఏదైనా పని పై దృష్టి పెట్టి  ఆ పని చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఈ కాళ్లు ఊపడం జరుగుతుంది. కాబట్టి ఊపడం  తగ్గించుకోవాలంటే ఈ నియమాలు  పాటించాలని  డాక్టర్లు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: