ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలు, అబ్బాయిలు కేవలం సన్నబడడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. కానీ ఒక్కసారి బరువు పెరిగిన తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా సన్నబడని వారు చాలా మందే ఉన్నారు. అలా సన్నబడక పోవడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, వారు తీసుకునే ఆహారం అని చెప్పవచ్చు. అయితే మీరు కూడా  సన్నబడలనుకుంటున్నారా.. ? అయితే రాత్రి పడుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి.


1). ముఖ్యంగా మనం ఆహారం తినేటప్పుడు రాత్రి సమయాలలో 7 గంటల లోపు తినడం మంచిది. ఆ తర్వాత ఆకలి వేసినా, ఒక చిన్న గ్లాసు నీటిని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే రాత్రిపూటనే ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.


2). రాత్రి పడుకునే ముందు కొంతమంది టీ, కాఫీ వంటివి తాగుతూ ఉంటారు. అలాంటివి అస్సలు చేయకండి. అలా తాగడం వల్ల సరిగ్గా నిద్రపోలేరు .

3). నిద్రపోయే ముందు నీటిని అసలు తాగవద్దు.. నీటిని తాగడం వల్ల  మనం నిద్రిస్తున్న కూడా జీర్ణక్రియ పని చేస్తూనే ఉంటుంది. అందుకే దానికి విశ్రాంతి ఇవ్వాలి కాబట్టి, రాత్రి సమయాలలో కడుపు ఖాళీగా ఉండటం మంచిది.


4). రాత్రి సమయాలలో అధిక ఆహారం, పిండి పదార్థాలు వంటివి తినడం చాలా ప్రమాదకరం. ఎందుచేత అంటే వీటివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది.అందుచేతనే రాత్రి సమయాలలో వీటిని అసలు తినకండి. ఏదైనా పండ్లు తీసుకుంటే చాలా మంచిది.

5). భోజనం చేసిన తరువాత ప్రతి ఒక్కరు వ్యాయామం వంటివి చేస్తూ ఉంటారు ఎక్కువగా.. అలా చేయడం సరికాదు. వ్యాయామాలు చేయడం వల్ల చాలా దుష్ప్రభావాలను  చూపే  అవకాశం ఎక్కువగా ఉంటుంది.

6). రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక గ్లాసు పాలు తాగి పడుకోవడం వలన ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది అని, నిద్ర కూడా బాగా పడుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: