మానసిక ఆరోగ్యం గా మనం ఎంత బాగా ఉంటామో, మన జీవితకాలం కూడా అంత ఎక్కువ కొనసాగుతుంది. ఇక ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు అయితే , మన జీవితకాలం కూడా 10 నుంచి 15 సంవత్సరాలు తగ్గుతుందట. ముఖ్యంగా మనం మానసికంగా కుంగిపోవడానికి కారణం అధిక ఒత్తిడి, అనవసర ఆలోచనలు, డిప్రెషన్ వంటి కారణాల వల్ల మనం మానసికంగా కుంగిపోవడం జరుగుతుందట. ఇక దీని కారణంగా మన జీవిత కాలం కూడా తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని సూత్రాలను తప్పకుండా పాటించాలని చెబుతున్నారు వైద్యులు. అయితే ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. సరైన నిద్ర:
మీకు ఎన్ని పనులు ఉన్నా సరే, అన్ని పక్కన పెట్టేసి, రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము.

2. పోషక విలువలు కలిగిన ఆహారం:
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొనే అలవాటు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మన శరీరానికి రోజుకు కావలసిన పోషకాలు అందుతున్నాయో..? లేదో..?  తెలుసుకొని పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల, ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా పరివర్తనం చెందుతాము.

3. నిత్యం ఎక్సర్సైజ్ చేయడం:
మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటే, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం , విశ్రాంతి తీసుకోవడం, పచ్చని వాతావరణంలో గడపడం వంటివి ఖచ్చితంగా చేయాలి.

4. మనుషులతో కలవడం:
ఇతరులతో మనం ఎప్పటికప్పుడు కలవడం, మాట్లాడుకోవడం వంటివి చేయడం వల్ల మనసులో ఉన్న భారం తగ్గి మనం ఆనందంగా ఉంటాను.


5. మెదడుకు శిక్షణ ఇవ్వడం:
మన మెదడును ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ, సరికొత్త విషయాలు తెలుసుకోవడానికి అలవాటు పడే లాగా శిక్షణ ఇవ్వాలి.

6. కొత్త విషయాలు తెలుసుకోవడం:
ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆత్రుత ఉన్నపుడు , మనసులోకి ఏ ఆలోచన కూడా దరిచేరదు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటూ ముందుకు సాగాలి.

ఇక వీటితో పాటు మీరు.. మీకు నచ్చిన వారికి ఏదైనా చేయడం, మీకు ఇష్టమైన పనులు అంటే షాపింగ్, ఆటలు ఆడడం, వంట చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, వీలైనంత వరకు నవ్వుతూ ఉండటం లాంటివి చేయడం వల్ల అటు మానసికంగా ఇటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: