కరోనా మహమ్మారి చుట్టుముడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు అందరి మనసులో తలెత్తుతున్న సందేహం ఏమిటంటే , ఈ సమయంలో ఈ కరోనా దాడికి తట్టుకోలేక జిమ్ సెంటర్లు, యోగా సెంటర్ లు అన్ని మూతపడుతున్నాయి కదా..! ఇక ఇప్పుడు బయట నడవడం మంచిదేనా..?  అని.. సాధారణంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం పూట వాకింగ్ చేయడం లేదా ఉదయాన్నే జాగింగ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇకపోతే ఈ కరోనా వైరస్ గాలిలో కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు.. కాబట్టి, ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ఇంకా తన తీవ్రతను తగ్గించు కోలేదు. ఇలాంటి సమయంలో బయట నడవడం మంచిదేనా..?  అని ప్రతి ఒక్కరు తమ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందేహానికి నివృత్తి ఇప్పుడు ఇక్కడ చేసుకుందాం..

ఒక నివేదికలో వైద్య నిపుణులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత కాలంలో ఆరుబయట నడవడం మంచిది కాదు.. అని చెబుతున్నారు. అయితే మీ శరీరం అందుకు ఒప్పుకోకపోతే సామాజిక దూరం పాటిస్తూ, తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  సూచిస్తున్నారు. అయితే మీరు ప్రతి జాగ్రత్తలు పాటిస్తున్నారు అని అనుకున్నట్లయితే ,తప్పకుండా ఆరుబయట నడవచ్చు అని వైద్య నిపుణులు సూచించడం జరిగింది. నోయిడాలో వున్న నియో హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ అంకిత్ జైన్ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతకాలంలో కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ మీరు తప్పకుండా వాకింగ్ చేయాలి అనుకుంటే, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, బయటకు వెళ్ళవచ్చని  ఆయన తెలిపారు. ముఖ్యంగా బయటికి వెళ్లాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఫేస్ షీల్డ్,  ఫేస్ మాస్క్ ,  గ్లౌజ్ లు తప్పకుండా ధరించాలి. అంతేకాదు ఉద్యానవనంలో లేదా ఆరుబయట ఎవరూ లేని సమయాన్ని మాత్రమే ఎంచుకొని , నడకను కొనసాగించండి. ఇక బయటకు వెళ్ళినప్పుడు బెంచీల పైన కూర్చీలో పైన కూర్చోవడం లేదా అక్కడి వస్తువులను ఇంటి లోకి తీసుకు రావడం లాంటివి చేయవద్దు.ఇక బయట నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే.. లోపలికి వెళ్లకుండా బయటే స్నానం చేసి వెళ్లడం ఉత్తమం.. ఇలాంటి జాగ్రత్తలు కనుక మీరు పాటిస్తున్నట్లు అయితే తప్పకుండా ఆరుబయట నడక కొనసాగించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: