కాలం మారింది, సాంకేతిక టెక్నాలజీ కూడా ఎంతో పెరిగింది. కానీ ఇంకా  ఆడ, మగ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల అంటేనే కడుపులోనే చిదిమేసే పరిస్థితి ఇంకా పోలేదు. ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే చంపేస్తున్నారు అని ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది. బిడ్డ పుట్టే వరకు ఆడైనా, మగైనా నిర్ధారణ చేయడం నేరమని  ఒకవేళ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని కఠిన చట్టాలు తీసుకొచ్చింది. అయినా కొన్ని ఆసుపత్రి యాజమాన్యాలు, డాక్టర్లు  డబ్బులకు కక్కుర్తి పడి  కడుపులో పెరుగుతున్న లింగనిర్ధారణ చేస్తున్నారు.

దీంతో చాలామంది  ఆడపిల్ల అని తెలిస్తే  కడుపులోనే చిదిమేస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అనేది  డాక్టర్లు చేసే స్కానింగ్ లో తెలుస్తుంది. చాలా ప్రైవేట్ హాస్పిటల్ లో ఈ యొక్క దందా కొనసాగుతోంది. 5 వేల నుంచి మొదలు లక్షల వరకు దండుకుంటూ లింగ నిర్ధారణ చేస్తున్నారు డాక్టర్లు. ఈ విధంగా రూల్స్ ను గంగలో కలుపుతూ, ఆడపిల్ల అంటేనే  ఆదిలోనే అంతం చేస్తున్నారు. అలాంటి ఓ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా లోని  ఎల్లారెడ్డిపేట, పిట్లం, బాన్సువాడ  పలు ఆసుపత్రుల్లో  లింగనిర్ధారణ స్కానింగు చేస్తున్నట్లు  సమాచారం. ఒక్కో  టెస్టుకు  2000 రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్యకాలంలో శ్రీ రామ్నగర్ కాలనీ లో ఉన్నటువంటి ఆస్పత్రికి  జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్, జగిత్యాల, మెదక్, ఖమ్మం కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చేవారిని తెలుస్తున్నది. వారు తీసినటువంటి స్కానింగ్లో ఆడపిల్ల అని తెలిస్తే చాలామంది అక్కడే అబార్షన్ చేయించినట్లు సమాచారం. ఈ విధంగా ఆసుపత్రి యాజమాన్యాలు కడుపులోని బిడ్డలను చిదిమేస్తూ, బయట ప్రపంచాన్ని చూడకముందే చంపుతున్నారు. ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఆడపిల్లలపై వివక్ష మాత్రం పోలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: