ప్రస్తుతం మన దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు కరోనా సెకండ్.. ప్రజలను ముప్పతిప్పలు పెట్టింది. ఈ కరోనా సెకండ్ వేవు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ... త్వరలో థర్డ్ వేవ్ రూపంలో మన దేశాన్ని ముంచేయనుంది ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా మనదేశంలో ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు అనేక సమస్యలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వైరల్ ఫీవర్, జలుబు మరియు ఇతర వైరస్ బారిన పడుతున్నారు. అయితే ఈ వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా మరియు ఒకవేళ వర్షం లో మనం తడిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.  వర్షం లో లో మనం తడిసిపోవడం వల్ల దగ్గు, జలుబు, ఇతర  ఇన్ఫెక్షన్స్ తో మనం బాధ పడతాము. అయితే  ఇలాంటి సమస్యలు మనకు రాకుండా ఉండాలి అంటే... మొదటగా తడిసిన దుస్తులను వెంటనే మార్చుకోవాలి. ఈ విధంగా చేయటం కారణంగా గా మన శరీరంలో ఉన్న టెంపరేచర్ సాధారణ స్థాయికి వస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే... శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి.. మొదట జలుబు తరువాత జ్వరం మనకు వస్తుంది.

తడిచిన బట్టలు మార్చుకున్న తర్వాత... యాంటీ బ్యాక్టీరియల్ కు ఏవైనా క్రీమ్ మన శరీరానికి రాసుకోవాలి. దీని కారణంగా మన శరీరం పై దాడి చేసే బ్యాక్టీరియా మరియు వైరస్ లను సులభంగా అరికట్టవచ్చు. ఆ తరువాత తడిచిన తలను శుభ్రంగా తుడుచుకోవాలి. దీంతో జలుబు మరియు దగ్గు లాంటివి మన చెంతకు రాలేవు. అలాగే వర్షంలో తడిసిన వారు... ఒక కప్పు టీ లేనిచో కషాయం లాంటివి తీసుకుంటే మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగును. అలాగే దీని కారణంగా మన శరీర ఉష్ణోగ్రత యధాస్థితికి వస్తుంది. ఎలాంటి జబ్బులు మరియు వైరస్ లు మనకు సోకవు.


మరింత సమాచారం తెలుసుకోండి: