సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పాలు వాడటం లాంటివి చేస్తూ ఉంటారు.  ఉదయం  టీ పెట్టుకోవాలన్నా లేదా పెరుగు పెట్టుకోవాలి అన్న కూడా తప్పనిసరిగా పాలు అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది ఈ మధ్య కాలంలో ప్యాకెట్ పాల పైనే ఆధారపడుతున్నారు. అయితే కొంతమందికి ప్యాకెట్ పాలు ఆరోగ్యానికి హానికరం అని భావించి ఇక వ్యాపారుల దగ్గర స్వచ్ఛమైన పాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇక ప్యాకెట్ పాలనే వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్యాకెట్ పాలు వాడుతున్న సమయంలో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.



 షాప్ నుంచి కొనుగోలు చేసిన ప్యాకెట్ పాలను ఎలాంటి వేడి చేయకుండా శుద్ధి చేయకుండా అలాగే తాగడం లాంటివి చేస్తూ వుంటారు చాలామంది. ఇలా చేయడం వల్ల ఆ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది అని అటు నిపుణులు చెబుతున్నారు. పాకెట్ పాలను వాడే వారు తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అని చెబుతున్నారు. కొన్ని హాని కారక సూక్ష్మజీవులను చంపేయడానికి ప్యాకెట్ పాలను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కొద్దిసేపు వేడి చేస్తారట. ఇలా వేడి చేసిన పాలను వెంటనే చాల్లార్చిన తర్వాత  ఆ పాలను ఒక ప్యాకెట్ లో ప్యాక్ చేస్తారట.



 అయితే ఇలా వేడిచేసి చల్లార్చిన పాలను ఇక పాకెట్లో ప్యాక్ చేసిన తర్వాత మళ్లీ ఉపయోగించాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఇక కొంతసేపటి వరకు వేడి చేయాలి అని చెబుతున్నారు నిపుణులు  అయితే ఇలా పాకెట్ లో దొరికే పాలను పాశ్చరైజేషన్ పాలు అని అంటారట. ఇలా కొంత మొత్తంలో వేడిచేసి చల్లార్చి ప్యాకెట్ లో ప్యాక్ చేసిన పాలు ఫ్రిజ్లో ఉంచితే రెండు రోజుల పాటు సురక్షితంగానే ఉంటాయట. అయితే  ఇలా ప్యాక్ చేసిన పాలను ఇక షాపులకు రవాణా చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. అప్పుడు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటాయి ఈ పాలు. అందుకే ఇక ప్యాకెట్ పాలను వాడేటప్పుడు వేడి చేసి తాగడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: