ప్రస్తుతం మనలోనే చాలామంది టీ తాగడానికి అలవాటు పడి ఉంటారు. టీ తాగడం వల్ల మనిషికి ఆకలి వేయదు. ఎంత అలసట లో ఉన్నా కూడా టీ తాగితే కొంతమేర శక్తి లభిస్తుంది. అందుచేతనే కొంతమంది ఎక్కువగా రెండు పూటలా టీ తాగుతూ ఉంటారు. అయితే కొంతమంది తెలిపిన ప్రకారం టీ ఎక్కువగా తాగితే క్యాన్సర్ వస్తుందని తెలిపారు అది నిజమో..? కాదో..? తెలుసుకుందాం.

ముందుగా టీ తాగడం వల్ల షుగర్ లెవెల్ సమానంగా ఉంటాయి. అంతేకాకుండా కడుపులో మంటను, గుండెజబ్బులను రానీయకుండా చేస్తోంది. టీ ని రోజులో ఒకసారి తాగితే.. ఏమీ కాదట. కానీ ఎక్కువగా తాగితే అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని కొంతమంది వైద్య నిపుణులు తెలిపారు.

టీ ని సాయంత్రం వేళలో తాగితే, రాత్రిపూట నిద్ర పట్టకుండా ఉంటుందట. ఎక్కువ గా వేడి గా ఉండే టీని తాగడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల కొంతమంది అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. టీ 150 ° ఫారెన్ హీట్ లో ఉంటే అది మన శరీరాన్ని తట్టుకోలేదు. ముఖ్యంగా ఇంత వేడి గలిగిన టీం మనం తాగినప్పుడు, అది 127 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు అన్నవాహిక కు చేరుకునే ప్రమాదం ఉంది. అన్నవాహిక నాళం ఆ వేడిని తట్టుకోలేక  తద్వారా గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.

దాంతో రక్తహీనత, ఐరన్ లోపం వంటి సమస్యలు వచ్చిపడతాయి. అందుచేతనే ఎక్కువగా వేడిగా ఉన్నా టీ ని తాగకూడదు అని వైద్య నిపుణులు తెలిపారు.  కానీ రోజులో ఒక్కసారి తాగితే ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పవచ్చు.

టీ ని విపరీతంగా తాగడం వల్ల, గుండె సమస్య,  తలనొప్పి, చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అందుచేతనే టీని ఎక్కువగా తాగే వారు, వాటిని తగ్గించుకునే అలవాటు చేసుకోవడం మంచిది. కాబట్టి టీ తాగాలని అనిపించినప్పుడు అందుకు ప్రత్యామ్నాయంగా ఒక చిన్న చాక్లెట్ తింటే సరిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: