COVID-19 మహమ్మారి కారణంగా ప్రజలు ఇంటి నుండి పని చేయడం కొనసాగిస్తుండటంతో, యువతలో కొత్తగా వెన్ను, మెడ మరియు భుజం నొప్పి కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.అవును చాలా మంది కూడా సిక్ స్కాపులా సిండ్రోమ్ తో బాధ పడుతున్నారు.

సిక్ స్కాపులా సిండ్రోమ్ అంటే ఏమిటి?

సిక్ స్కాపులా సిండ్రోమ్ ని స్కాపులర్ డైస్కినిసిస్ అని కూడా పిలుస్తారు, ఇది భుజం కీలు లోపల ఉన్న స్కాపులా (భుజం ఎముక) అసాధారణ నొప్పి.దీని గురించి ఆర్థోపెడిక్స్ మరియు బోన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రఘు నాగరాజ్ మాట్లాడటం జరిగింది.కరోనా మహమ్మారి వల్ల డబ్ల్యూఎఫ్‌హెచ్ కల్చర్ మరియు లాక్డౌన్ ప్రారంభమైన తరువాత, 20-25 ఇంకా 30-45 సంవత్సరాల వయస్సు గల యువతలో సిక్ స్కాపులా సిండ్రోమ్ కేసుల్లో ఎక్కువ శాతం పెరుగుదల కనిపించింది. సాధారణంగా అథ్లెట్లకు 61 శాతం స్కాపులర్ డైస్కినిసిస్ ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా   వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎక్కువగా కూర్చున్న లేదా విరామం లేకుండా గంటల తరబడి కూర్చోవడం వంటివి ఇటువంటి కేసులకు దారితీశాయి.ఇక దీని సాధారణ లక్షణాలు వచ్చేసి నొప్పి. ఈ నొప్పి వల్ల భుజం లేదా చేయి కదపడం అనేది చాలా కష్టం అవుతుంది.ఇక లాక్డౌన్ అంతటా కూడా అధిక వ్యాయామం కారణంగా కండరాల సమస్యల కేసుల సంఖ్య కనిపించింది.సిక్ స్కాపులా సిండ్రోమ్ వ్యాప్తి గురైన వారిలో ఎక్కువగా ప్రత్యేకించి IT ప్రొఫెషనల్స్, రిసెప్షన్ మరియు డెస్క్ వర్కర్స్  ఆశ్చర్యకరంగా పెరిగారు.


ఇక ఈ సమస్యని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా రోజు వ్యాయామం చెయ్యాలి. అలా అని మరీ ఎక్కువగా వ్యాయామం చెయ్యకూడదు. రోజు పొద్దున పూట ఒక గంట పాటు వ్యాయామం అనేది చెయ్యాలి. మరీ అంత ఎక్కువగా వ్యాయామం చేసిన కాని ఈ సమస్య అనేది వస్తుంది. అలాగే ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వారు పని మధ్యలో కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటూ ఉండాలి. కొంచెం సేపు విరామం తీసుకొని రిలాక్స్ అయిన తరువాత మళ్ళీ తమ పనిని ప్రారంభించవచ్చు. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మీరు ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: