ప్రపంచంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి. ఇది గొంతు లోపల, కాలర్ బోన్ పైన ఉంటుంది. థైరాయిడ్ అనేది ఒక రకమైన ఎండోక్రైన్ గ్రంథి, ఇది హార్మోన్లను తయారు చేస్తుంది. ఈ సమస్య మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ గ్రంథిలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అలసట, జుట్టు విరిగిపోవడం, జలుబు, బరువు పెరగడం లాంటి ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది.

థైరాయిడ్ లక్షణాలు:
చికాకు, అధిక చెమట, చేతులు వణకడం, సన్నబడటం, జుట్టు రాలడం, కండరాల బలహీనత, నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, బరువు తగ్గడం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ లేదా తక్కువ పరిమాణంలో ప్రారంభమైనప్పుడు థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. థైరాయిడ్‌లో రెండు రకాలు ఉన్నాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఈ రెండు పరిస్థితులు థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే వివిధ వ్యాధుల వల్ల కలుగుతాయి.

థైరాయిడ్ నియంత్రణ ఆహారాలు
పోషక, సమతుల్య ఆహారంతో పాటు మందులు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ లక్షణాలను తగ్గించవచ్చు. ఆహారంలో అయోడిన్, కాల్షియం, విటమిన్ డి ఉన్న వాటిని చేర్చుకోవాలి. థైరాయిడ్ లక్షణాలను తగ్గించే 4 పండ్ల గురించి తెలుసుకుందాం.

1.పైనాపిల్
పైనాపిల్ లో విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది అలసట నుంచి ఉపశమనం ఇస్తుంది. పైనాపిల్ క్యాన్సర్, కణితి, మలబద్ధకం వంటి వాటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

2.యాపిల్స్
రోజూ ఒక ఆపిల్ తినడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. రక్తంలో చక్కెరను, థైరాయిడ్ గ్రంథిని  కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

3. జామూన్
బెర్రీలలో థైరాయిడ్ ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి. జామున్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. థైరాయిడ్‌లో డయాబెటిస్,యు బరువు పెరగడం సాధారణం. మీరు మీ ఆహారంలో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ చేర్చవచ్చు.

4. నారింజ
నారింజను తినడం వలన అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: