చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా మహిళలకు ఆరోగ్యం కన్నా బాధ్యతలే ఎక్కువ. ఏ వస్తువును ఇంట్లో ఎక్కడ ఉంచాలి ? ఇల్లును శుభ్రంగా ఎలా ఉంచాలి ? వంటి విషయాలను ఆలోచించడానికే టైం సరిపోతుంది. టీనేజ్ వరకు అమ్మానాన్నా మనం తిన్నామా ? లేదా అనే విషయాలు చూసుకుంటారు. కానీ ఆ తరువాత మాత్రం మనమే మన ఆహరం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 20 ఏళ్ళు దాటిన అమ్మాయిలు వారి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ సమయంలో వారి జీవితంలో అనేక మానసిక, శారీరక హార్మోన్ల మార్పులు వస్తాయి. మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని ఆహారాల పదార్థాలను ఆహారంలో చేర్చాలి. అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిల ఆరోగ్యం మరింత సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో వివిధ దశల్లో వారిలో హార్మోన్ల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇది వారి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మహిళలు 20 ఏళ్ళ తర్వాత ఈ క్రింది ఆహారాలను తీసుకుంటే చాలా వరకు ఆరోగ్యంగానే ఉండొచ్చు.

పాలు
మహిళలు క్రమం తప్పకుండా పాలు తీసుకోవాలి. ఎందుకంటే వారి ఎముకలు బలహీనపడే ప్రమాదం చాలా ఎక్కువ. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి మొదలైన పోషకాలు ఉంటాయి.

ఆరెంజ్ జ్యూస్
20 సంవత్సరాల తర్వాత, పీరియడ్స్, హార్మోన్ల మార్పులతో పాటు వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. దీని కోసం మిమ్మల్ని మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. మహిళలు ఎక్కువగా ఆరెంజ్ జ్యూస్ తాగాలి. ఇది శక్తిని అందించడమే కాకుండా ఇందులో ఉండే విటమిన్-సి కూడా జుట్టు, చర్మం బలంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

టమోటా
మహిళలు ప్రధానంగా 20 ఏళ్ల తర్వాత టమోటాలను ఆహారంలో చేర్చాలి. ఎందుకంటే ఇందులో లైకోపీన్ అనే మూలకం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ నుండి రక్షణ కల్పించడంలో ఈ మూలకం సహాయ పడుతుంది. టమోటా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

సోయాబీన్
మహిళలు సోయాబీన్స్ తినడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ప్రోటీన్, ఐరన్, విటమిన్-బి అందిస్తుంది. మహిళలకు ఐరన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇనుము లోపం కారణంగా వాళ్ళు రక్తహీనతకు గురవుతారు.

డ్రై ఫ్రూట్స్
మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకోవాలి. దీని నుండి ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఒమేగా -3, ఆరోగ్యకరమైన కొవ్వులు మొదలైనవి పొందవచ్చు. మహిళలు బాదం, వాల్ నట్స్, ఎండుద్రాక్ష, అత్తి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: