క‌రోనా వైర‌స్ నుంచి కొలుకుంటున్న ప్ర‌పంచా దేశాల‌కు మ‌రో క‌ష్టాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే కరోనా నుంచి కొలుకున్న వారికి చాలా మందికి ప‌లు ర‌కాల ఫంగాస్ లు వచ్చాయి. బ్లాక్ ఫంగాస్‌, వైట్ ఫంగాస్‌, య‌ల్లో ఫంగాస్ వంటి దాడి చేశాయి. ఇప్ప‌టి కే వీటి చాలా మంది మృత్యు వాత ప‌డ్డారు. ఇప్పుడు తాజా గా క‌రోనా వైర‌స్ నుంచి కొలుకున్న వారికి డెలిరియం అనే కొత్త వ్యాధి అమెరికా లో జ‌రిపిన ప‌రిశోద‌న ల‌ల్లో తెలింది. ఈ వ్యాధి వ‌ల్ల మ‌తి మ‌రుపు వ‌స్తుంద‌ని శాస్త్ర వేత్తలు ప్ర‌క‌టించారు. దీంతో క‌రోనా నుంచి కొలుకున్న వారు ఇప్పుడు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు.


ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ బీఎంజీ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ లో ప్ర‌చు రించారు. దీనికి సంబంధించి వారు చేసిన అధ్య‌య‌నంలో ప‌లు కీల‌క అంశాల‌ను వెల్ల‌డించారు. దీని ప్ర‌కారం 2020  సంవ‌త్స‌రం మార్చి మే నెల‌ల మ‌ధ్య క‌రోనా వ‌ల్ల ఐసీయూ లో చేరి కొలుకుని వ‌చ్చిన వారి వైద్య రికార్డు ల‌ను వైద్యులు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మ‌తి మ‌రుపు కొల్పోయిన వారి గురించి అధ్య‌య‌నం చేశారు. వారికి మ‌తి మ‌రుపు రావ‌డానికి గ‌ల కార‌ణాల పై ఆర తీశారు. అయితే కరోనా వ‌ల్ల మెద‌డుకు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా త‌గ్గ‌డం తో పాటు ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం, అలాగే హార్ట్ ఎటాక్ కు దారి తీస్తున్నాయి. వీటి అన్నిటి వ‌ల్ల చివ‌రికి ఏర్పాడే బ‌ల‌హీన‌త వ‌ల్ల మ‌తి మ‌రుపు ఏర్ప‌డుతోంద‌ని వారి అధ్య‌య‌నం లో తెలింద‌ని డాక్ట‌ర్ ఫిలిప్ వ్లిసైడ్స్ అన్నారు.  



డెలిరియం వ్య‌ధి ఉన్న వారిలో ముఖ్యంగా గంద‌ర గోళం, ఆందోళ‌న‌, మెద‌డు వాపు వంటి ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉన్నాయ‌ని వైధ్యులు తెలిపారు. వారికి క‌రోనా వైర‌స్ వ‌చ్చిన మొద‌ట్లో మ‌తి మ‌రుపు న‌కు చికిత్స చేయ‌లేద‌ని అందుకు కూడా ఒక కార‌ణ‌మ‌ని అన్నారు. డెలిరియం నుంచి కొలుకోవాలంటే వారి కుటుంబ స‌భ్య‌లను త‌రుచూ క‌లుస్తు ఉండాల‌ని అన్నారు. అలాగే రోగి కోసం త‌మ ఇంటి లో ఉన్న కొన్ని వ‌స్తువుల‌ను తీసుకు వ‌చ్చి చూపాల‌ని తెలిపారు. వీటితో పాటు ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల లేని వారు వీడియో కాల్ ద్వారా క‌ల‌వాల‌ని అన్నారు. వీటి వ‌ల్ల డెలిరీయం వ్యాధి గ్ర‌స్తుల‌కు మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: