బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో మనందరికీ తెలిసిందే.. కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు బొప్పాయి ఆకులు, బొప్పాయి పండు లోపలి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ఇకపోతే సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ బొప్పాయి పండు తినేటప్పుడు పండును మాత్రమే తిని, ఇందులో ఉన్న విత్తనాలను పడేస్తూ ఉంటారు.. ఇక ఈ విత్తనాల వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని..వీటిని బంగారం కంటే విలువైన వాటిలా దాచుకోవాలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.. అయితే బొప్పాయి విత్తనాలు వల్ల మన శరీరానికి ఎలాంటి మంచి కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బొప్పాయి గింజలలో  పోషకాలు సమృద్ధిగా లభించడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. ఇక  రోజుకు కొన్ని తీసుకొని , ఎండబెట్టి ,పొడి చేసుకుని.. ఆ పొడిని సలాడ్స్ లేదా సూప్ లలో  కలుపుకుని తాగడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను దూరం చేయడమే కాకుండా అవి ఆరోగ్యంగా పని చేసుకోవడానికి సహాయపడతాయి.. శరీరంలో వచ్చే చెడు బ్యాక్టీరియా, వైరస్ ను బయటకి పారద్రోలే శక్తి ఈ బొప్పాయి గింజలకు ఉంది.

మలబద్ధకం ,జీర్ణ సమస్యలు, కడుపులో మంట, కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు వంటి వాటిని నయం చేయడానికి ఈ బొప్పాయి గింజలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ బొప్పాయి గింజల్లో ఫైబర్ అధిక శాతంలో ఉండటం కారణం చేత జీర్ణ వ్యవస్థ పనితీరు  మెరుగుపడి శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. ఫలితంగా బరువు కూడా తగ్గవచ్చు. అలాగే కండరాలు బలంగా మరి అలసట నీరసం వంటివి తగ్గుతాయి.

అధిక రక్తపోటును కూడా తగ్గించే శక్తి ఈ బొప్పాయి గింజలకు ఉంది. బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని రోజుకు పావు టేబుల్ స్పూన్ తేనెలో కలుపుకొని తినడం వలన మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.. అయితే కేవలం పావు టేబుల్ స్పూన్ బొప్పాయి గింజల పొడిని మాత్రమే రోజుకు తీసుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: