కరివేపాకును సాంబార్ వంటి వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. వాసనతో పాటు, ఈ ఆకులో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. భారతీయ వంటకాల్లో దీని ప్రత్యేకత వేరు. కరివేపాకును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు డైట్ నిపుణులు. ఇది యాంటీఆక్సిడెంట్స్ తో పాటు అనేక పోషకాలను కలిగి ఉండడం వల్ల వంటకాలకు మంచి రుచిని ఇస్తుంది. అనేక వ్యాధులను తొలగిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం కరివేపాకు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తహీనతను తొలగించడంలో సహాయ పడుతుంది. కరివేపాకులో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. కరివేపాకును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా కరివేపాకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే శరీరంలోని అదనపు కొవ్వును తొలగించుకోవచ్చు. అవి జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా కరివేపాకు నమలడం లేదా తినడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ బయటకు పోవడమే కాకుండా కేలరీలు కరుగుతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

బరువు తగ్గడానికి కరివేపాకును ఎలా ఉపయోగించాలి
బరువు తగ్గడానికి కరివేపాకును చాలా బాగా ఉపయోగించవచ్చు. ఆహారంలో కరివేపాకును చేర్చి బరువును నియంత్రించవచ్చు.
1. మీ వంటలలో కరివేపాకు జోడించండి.
2. కరివేపాకును ఖాళీ కడుపుతో తిని నమలండి.
3. కరివేపాకు టీని తాగండి.

దాదాపు 10-20 కరివేపాకు ఆకులను తీసుకుని వాటిని నీటిలో మరిగించండి. కొన్ని నిమిషాల తర్వాత ఆకులను తొలగించడానికి నీటిని వడకట్టండి. దాని రుచిని పెంచడానికి దానికి కొద్దిగా తేనె, నిమ్మరసం జోడించండి. ఈ కషాయాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి. బరువు తగ్గడానికి మంచి టిప్ ఇది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: