బాధ్యతల్లో వివక్షత కూడదు  :ఐసి ఎం.ఆర్  
కంటికి కనిపించని శత్రువు కోవిడ్-19. ఈ మహమ్మారిపై పోరు సాగించడంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు సైనికుల్లా పోరాడాలి. ఇది ప్రపం వ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలు చపుతున్న మాట. సరిగ్గా దీనినే ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పునరుద్ధాటించారు.  వైద్య సేవలు అందించే వారు ఎట్టి  పరిస్తితుల్లోనూ వివక్షత పాటించ కూడదని కూడా బలరాం చెప్పారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది  విధుల్లో చేరాక ఎట్టి పరిస్థితులలోనూ తమకు  పై అధికారులు అప్పగించిన బాధ్యతలను  విస్మరించ రాదన్నారు.  భారత్ లోని గ్రామాలలో చాలా చోట్ల వైద్య సేవలు అంతంత మాత్రం గానే ఉన్నాయని ఐసిఎం.ఆర్ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కోవిడ్ టీకా వేసుకునేందుకు ప్రజలు ముందుకు రాని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రజలే స్వచ్ఛందంగా అడిగి మరీ  వ్యాక్సన్ వేయించుకుంటున్నారు అని బలరాం తెలిపారు. ఢిల్లీ వైద్య విశ్వ విద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా బలరాం కీలక  ప్రసంగం చేశారు. వైద్య వృత్తిలో వస్తున్న వారిలో సేవాభావం కొంత లోపిస్తోందని కూడా ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తన దైన శైలిలో  సోదాహరణంగా ప్రసంగించారు. వైద్యం గ్రామీణ ప్రాంతాల వారికి అందనంత దూరంలో ఉందని చెప్పారు. మధ్య తరగతి వారికి ఖరీదైనదిని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.   కేంద్రస, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో వైద్యరంగానికి చేస్తున్న అందిస్తున్న నిధులు సంతృప్తి కరంగా ఉన్నాయన్నారు.  మరిన్ని కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వాలకు  కార్పోరేట్ రంగం  తోడ్పాటు నందిస్తే మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. ప్రజల్లో వైద్యం పై అవగాహన పెరగాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో  ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ పథకం ద్వారా చాలా సమస్యలు  దూరమవుతాయని వెంకయ్య నాయుడు తెలిపారు. భారత్ లో జనాభా ఎక్కువగా ఉన్నారని, ఫలితంగా  రోగుల సంఖ్యం కూడా ఎక్కువ ఉందని చెప్పారు. రోగుల జబ్బులను నయం చేసేందుకు సరిపడినంత మంది వైద్యులు భారత్ లో లేరని ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయ పడ్డారు. విశ్వ విద్యాలం ఉప కులపతి జోషి తదితరులు ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: