కొంత మంది కి కొన్ని శ‌బ్ధాలు వ‌స్తే ఎదోలా ఉంటుంది. అలాగే ఎదైనా ఇనుమును రంపం తో కొసినా మ‌న వోళ్లు మండిపోతుంది. మ‌న శ‌రీరాన్నే కొసిన‌ట్టు అనిపిస్తుంది. అలాగే ఎక్క‌డైనా గ‌ర గ‌ర మ‌ని సౌండ్ వ‌చ్చినా మ‌న‌కు ఎదోలా ఉంటుంది. కొంత మంది తింటున్నప్పుడు శ‌బ్ధాలు చేస్తారు. ఆ సౌండ్ లు మ‌న‌కు వినిపించినా చీరాకు వేస్తుంది. వీటితో పాటు తోటి వారు టూత్ బ్రేష్ వాడి న‌ప్పుడు గ‌ర గ‌ర మ‌ని శ‌బ్ధాలు వ‌స్తాయి. ఇవి కూడా కొంత మందికి చీరాకు వ‌చ్చేలా ఉంటాయి. ఇలా కొన్ని శ‌బ్ధాలు వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు చీరాకు వ‌స్తే... మ‌న‌కు ఒక ర‌క‌మైనా జ‌బ్బు ఉంద‌ని అర్థం మ‌ని అంటున్నారు. ఇప్పుడు మ‌నం ఆ జ‌బ్బు గురించి మ‌రియు ఆ జ‌బ్బు కు ఉన్న చికిత్స గురించి తెలుసుకుందాం.ఇలా ఏదైనా శ‌బ్ధాల‌ను త‌ట్టు కోలేని జ‌బ్బు ను సెల‌క్టీవ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అని పిలుస్తారు. అలాగే దీన్ని వైధ్య ప‌ర‌మైన భాషా లో చెప్పాలంటే మిసోఫోనియా అంటారు. సెల‌క్టీవ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అనే జ‌బ్బు అబ్సెసివ్ కంపాల్సివ‌ఖ డిజార్డ‌ర్ లాంటి జ‌బ్బు వంటిది. మ‌నంద‌రికీ ఇలాంటి కొన్ని శ‌బ్ధాలు విన్న‌ప్పుడు చీరాకు వెస్తుంది. ఇది కొంత వ‌ర‌కు  స‌హ‌జ‌మే. కానీ మ‌రి కొంత మంది కొన్ని ఇలాంటి శ‌బ్ధాలు విన్న‌ప్పుడు తీవ్ర మైన కోపానికి గురి అవుతారు. అలాగే వారి చెమ‌టలు ప‌ట్ట‌డం, అలాగే గుండే వేగం గా కొట్టు కోవ‌డం వంటి వి అవుతాయి. అలాగే మ‌రి కొంత మందికి కండ‌రాలు నొప్పి పెట్ట‌డం కూడా జ‌రుగుతుంది. ఇలా అయితే సెల‌క్టీవ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అనే వ్యాధి సాధార‌ణ స్టాయి నుంచి తీవ్ర స్థాయి కి చేరుకున్న‌ట్టే.దీనికి చికిత్స కూడా ఉంది. సెల‌క్టీవ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్ వ్యాధీ తీవ్ర స్థాయి కి చెరుకున్న వారికి ఒక ప్ర‌త్యేక మైన థేరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ థేర‌పీ నే బిహేవియ‌ర‌ల్ థెర‌పీ అంటారు. ఈ బిహేవియ‌ర‌ల్ థెర‌పీ ద్వారా ఈ వ్యాధి గ్ర‌స్తుల‌కు చిన్న చిన్న సౌండ్ ల‌ను అల‌వాటు చేస్తారు. మొద‌టి చిన్నగా సౌండ్ వ‌చ్చేలా ఫ్యాన్ వేసి ఆ చిన్న సౌండ్ ను అల‌వాటు చేస్తారు. దీని త‌ర్వాత క్ర‌మంగా శ‌బ్ధాల తీవ్ర‌త ను పెంచుతూ పోతారు. దీని వ‌ల్ల సెల‌క్టీవ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అనే వ్యాధీ త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని వైధ్యుల అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: