సాధారణంగా ప్రతి ఒక్కరికీ దురద సమస్య ఉంటుంది.. అయితే ఈ దురద అనేది జననాంగాల దగ్గర వస్తే చాలా ఇబ్బంది.. ఇక ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు.. ఒంటరిగా ఉన్నప్పుడు జననాంగాల వద్ద దురద వస్తే నే తట్టుకోలేని పరిస్థితి..ఇక నలుగురిలో ఉన్నప్పుడు ఈ సమస్య ఎదురైతే.. ఇక బాధ నరకయాతనగా అనిపిస్తుంది.. ఇకపోతే దురద అనేది జననాంగాల వద్ద మరీ ఎక్కువగా ఎందుకు వస్తుంది అనే విషయానికొస్తే, మన శరీరం పై ఏదైనా తెలియని సూక్ష్మక్రిమి జననాంగాల దగ్గర వాలినప్పుడు, అది పాకినా, నడిచినా, కొరికినప్పుడు కూడా ఇలాంటి దురద మొదలవుతుంది.


అలా దురద వచ్చినప్పుడు వెన్నెముకలోని స్పైనల్ కార్డ్ లో ఇన్హిబిటరీ న్యూరాన్లు ఒక్కసారిగా యాక్టిివ్ అయ్యి పనిచేస్తాయి. ఇవి దురదను తెప్పిస్తాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో ఏదో ఒక సంబంధం లేని సూక్ష్మ క్రిమి  వచ్చిందని , మెదడు కి సమాచారం అందిస్తాయి. ఇక మనకు దురద కలిగినప్పుడు ఎప్పుడైతే గోకుతామో.. అప్పుడు  అక్కడ ఉన్న సూక్ష్మక్రిములు ఒక్కసారిగా చెల్లా చెదురై అక్కడి నుండి వెళ్లి పోతాయి. ఇక అప్పుడు ఇలా సూక్ష్మక్రిములు వెళ్ళిపోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.. ఈ సమస్య ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించండి.


పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా లభిస్తాయి.. ఇవి మన శరీరంలో మంచి బ్యాక్టీరియా పెంచి,  చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి పెరుగును జననాంగాల దగ్గర  దురద వచ్చే ప్రదేశంలో రాయడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరి నూనె లో యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా దొరుకుతాయి.. కాబట్టి  దురద వచ్చే ప్రదేశం లో కొబ్బరి నూనెను రాయడం వల్ల దురద తగ్గుతుంది .. అంతేకాదు మీకు సమయం ఉంటే కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి రావడం వల్ల మరింత ఉపశమనం కలుగుతుంది.

వేపాకులలో యాంటీ ఫంగల్ తో పాటు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి..కాబట్టి క్యాండిడా , ఈస్ట్ వంటి ఫంగస్‌కి వ్యతిరేకంగా కూడా పోరాడి, దురదను తగ్గిస్తుంది.. మీరు స్నానం చేయడానికి వెళ్లే పది నిమిషాల ముందు వేపాకుల రసం అప్లై చేసి,  కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత స్నానం చేయడం వల్ల ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ మూడు ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి సులభంగా దురద సమస్య నుంచి బయట పడవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: