సమసమాజంలో మానవత్వం విలువలు తగ్గిపోతున్నాయని పరిస్థితులను చూస్తేనే తెలిసిపోతుంది. మనిషినే మనిషి మోసం చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు. ఒకరిని చంపి ఇంకొకరు బ్రతుకుతున్నారు. కేవలం వారి స్వార్ధ ప్రయోజనాల గురించి తప్ప తోటివారు అనే ఆలోచన ఉండటం లేదు. గతంలో ఎలుకలపై ప్రయోగాలు ప్రారంభించేవారు, కరోనా ప్రారంభం అయినప్పటి నుండి సరాసరి మనుషులపైనే ఈ ప్రయోగాలు అనుమతి లేకుండానే జరిగిపోతున్నాయి. అయితే తాము ప్రయోగాలకు బలైపోతున్నాం అన్న విషయం కూడా ఎవరికి తెలియకపోవడం ఇక్కడ విచిత్రం. ఒకపక్క స్పష్టంగా వాక్సిన్ వచ్చినప్పటికీ తమ వంతుగా ఖచ్చితంగా నిరూపించుకోవాలనే పిచ్చి పట్టుదలతో ఈ ప్రయోగాలకు తెగబడుతున్నారు.

తాజాగా బ్రెజిల్ లో ఇలాంటి స్కాం ఒకటి బయటపడింది. అక్కడ ఉన్న ఒక వృద్ధుల వైద్యశాలలో ఈ తరహా అనుమతి లేని ప్రయోగాలకు ఆసుపత్రి యాజమాన్యం పూనుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ విషయం వైద్యం కోసం వచ్చే వారికి ఏమాత్రం తెలియకుండా జాగర్త పడుతున్నారు. ఆ ఆసుపత్రికి వచ్చే కరోనా బాధితులకు లక్ష్యంగా చేసుకుని వారికి అనుమతి లేని కరోనా ఔషధాలను ఇస్తూ ఉన్నారు. ఇది తెలియని వారు ఆ ఔషధాలను వాడటం వలన మృతి చెందుతున్నారు. ఈ మృతులతో కొందరు కుటుంబాలు విషాదాన్ని తట్టుకోలేక ఆసుపత్రి చేసే వైద్యంలో అనుమతి లేని ఔషదాలు వాడుతున్నట్టు తెలుసుకొని వారిపై కేసు పెట్టారు. అయినా ఆసుపత్రి వర్గాలు మాత్రం చేసిన తప్పులు ఒప్పుకోకుండా తాము తప్పు చేయటం లేదని వాదిస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

బ్రెజిల్ లో కరోనా రెండో వేవ్ లో కాటియా తన తల్లిదండ్రులను వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా కేవలం ఆసుపత్రి వారి నిర్లక్ష్య వైద్యం వలన కోల్పోయినట్టు చెపుతున్నారు. ఒకే నెలలో ఆమె ఈ ఇద్దరినీ కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమయంలో అక్కడ రోజు 40000 కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తమ తల్లిదండ్రులు అతిత్వరలో 54వ పెళ్లి వేడుక జరుపుకోనున్నారు, కానీ ఇప్పుడు అదంతా కలగానే మిగిలిపోయిందని ఆమె వాపోయారు. తొలుత ఆమె తండ్రికి కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రికి తీసుకెళ్లగా వాళ్ళు కరోనా కిట్ ఇచ్చి వాడమన్నారు. అయినా ఫలితం లేక శ్వాస కూడా తీసుకోలేకపోయిన ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినా ఐదు రోజుల తరువాత ఆయన మరణించారు. తండ్రికి సేవలు చేస్తూ ఉన్న తల్లికి కూడా లక్షణాలు ఉండటంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు  ఔషదాలు ఇచ్చారు. దీనితో కొద్దికాలంలో ఆమె కూడా మరణించారు. ఇలా అనుమతి లేని ఔషధాలను ఇస్తూ ఎంతమందిని చంపుతారు అంటూ ఆమె కోర్టులో కేసు వేశారు. ఆ విచారణ కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: