ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి కొవాక్సిన్ టీకా పై మొదటికే వచ్చింది. తనకు ఇంకా అదనపు సమాచారం కలవాలని లేకపోతే అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. అనుమతి ఇవ్వాలంటే ముందు తాము క్షుణ్ణంగా టీకాపై పరీక్షలు జరపాల్సి ఉందని,అనంతరం మాత్రమే అనుమతి ఇవ్వడం జారుతుందని సంస్థ వ్యాఖ్యానించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ వారు తగిన సమాచారాన్ని వీలైనంత త్వరగా ఆంచించగలరని ఆశిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుమతి కోసం ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానికి సమాధానంగా ఆరోగ్య సంస్థ ఈ టీకా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నందువలన మేము అనుమతి ఇవ్వలేము, దానిని క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే అత్యవసర వినియోగానికి అంగీకరిస్తాం అంటుంది ఆరోగ్య సంస్థ.

ఇప్పటికే భారత్ బయో టెక్ పలుమార్లు ఆరోగ్య సంస్థకు తమ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మరింత సమాచారం కావాలని ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇప్పటికే ఇచ్చిన సమాచారాన్ని ఆరోగ్య సంస్థ నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. వారు మరింత సమాచారం కావాలని అడిగినందున తాము భారత్ బయోటిక్ సంస్థను అదనపు సమాచారం అడగటం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త కోరగా, డబ్ల్యూ.హెచ్.ఓ. కూడా దానిని సమర్థిస్తూ అదనపు సమాచారాన్ని కోరింది. మరోసారి పరీక్ష అనంతరం ఈ టీకా పై అనుమతి ఇచ్చేది లేనిది తేల్చడం కోసం ప్రతినిధులు ఈ నెల 26న సమావేశం అవనున్నారు.

అయితే ఇలా డబ్ల్యూ.హెచ్.ఓ. అదనపు సమాచారం అంటూ కాలక్షేపం చేయడం సరికాదని, త్వరితగతిన అనుమతి ఇస్తే అది కావాల్సిన వారికి అందుబాటులోకి తేవాలి అన్న భారత్ ఆకాంక్ష నెరవేరుతుందని భారత్ బయోటిక్ సంస్థ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే పలు దేశాలలో కరోనా మరోసారి విజృంభిస్తున్నందున అత్యవసర వినియోగానికి అనుమతి వస్తే వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ను కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: