కరోనా వైరస్ ముందు చవిచూసిన చైనా దాని నుండి ప్రపంచం కంటే ఏంతో ముందే బయటపడింది. అయితే అప్పుడప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఈ వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరోసారి కరోనా తీవ్రంగా వ్యాపిస్తుండటంతో అక్కడ చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ విధించినట్టు తెలుస్తుంది. అలాగే మిగిలిన ప్రాంతాలలో ప్రజల పై ఆంక్షలు అమలుచేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర చైనా లోని రెండు ప్రధాన నగరాలలో లాక్ డౌన్ అమలులోనే ఉంది. ఆయా ప్రాంతాలలో పూర్తిస్థాయిలో పరీక్షలను చేయడం ద్వారా వైరస్ కు గురైన వారిని ఐసొలేషన్ కు తరలిస్తున్నారు. కరోనా ఉదృతంగా ఉన్న ప్రాంతాలలో కఠినమైన నిబంధనలు విధించింది చైనా.

శాంక్సీ ప్రావిన్స్ లోని నార్త్ వెస్ట్రన్ నగరంలో క్సియాన్ లో తొమ్మిది మందికి కరోనా పరీక్ష చేయగా, ఐదుగురు వైరస్ సోకినవారు ఉన్నట్టు తేలింది. వారిలో ఇద్దరు ఉత్తర చైనీయులు మంగోలియా వారు ఉన్నారు. దీనితో ఆ ప్రాంతంలో కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అంటే మంగోలియా, హువాన్, షాంజి ప్రావిన్స్ లు లాక్ డౌన్ లోనే ఉన్నాయి. ప్రభుత్వం హఠాత్తుగా కఠిన నిబంధనలతో కూడిన లాక్ డౌన్ పెట్టడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులకు గురిఅవుతున్నారు.  

తాజాగా అక్కడి వైద్య శాఖ నివేదిక ప్రకారం మంగోలియా లో 9 కేసులు, షాంజి, హువాన్ ప్రావిన్స్ లలో రెండు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. అలాగే విదేశాల నుండి వచ్చిన వారికి మరో 25మందికి ఈ వైరస్ సోకినట్టు గణాంకాలు చెపుతున్నాయి. అయితే ఒక్క మరణం కూడా సంభవించలేదు. మెయిన్ ల్యాండ్ లో 96517కేసులు నమోదు అయ్యాయి. మంగోలియాలో మొత్తం 76000 జనాభా ఉంటుంది. అలాగే ఈరెంహోట్ నగరంలో కూడా 76000 జనాభా ఉంది, అక్కడ కూడా లాక్ డౌన్ విధించబడింది. అత్యవసరాలకు తప్ప బయటకు రావడానికి వీలులేదు, ప్రయాణాలు కూడా అవసరం అయితేనే వెళ్లాలని, లేదంటే ఇంటికే పరిమితం కావటం మంచిదని అక్కడ అధికారులు కఠిన నిబంధనలు విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: