అసలే వర్షాకాలం.. పైగా ఎక్కడ చూసినా నీటి కుంటలు.. చుట్టూ ప్రదేశాలన్నీ నీటి మయం.. ఇలాంటి సమయంలోనే కుంటలలో, చెరువులలో వర్షపు నీరు నిండిపోయి..ఈ నీరు ఎక్కడికి వెళ్ళలేక ఒకేచోట మురుగు నీరు గా మారిపోతున్నాయి.. ఇక ఇలాంటి నీటిలోనే దోమలు లార్వాలను పుట్టించి అందరికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఎక్కువవుతున్నాయి.. జ్వరాలు రావడం వల్ల వాంతులు, విపరీతమైన జ్వరం, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు , తల తిరగడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ మలేరియా లాంటి ప్రాణాంతకమైన జ్వరాన్ని తగ్గించాలంటే ఒక్కటే ఔషధం అని అంటున్నారు వైద్యులు.. అదేంటో దాన్ని ఎలా ఉపయోగించాలో మనం కూడా ఒక సారి చదివి తెలుసుకుందాం..

మలేరియా జ్వరం ఎక్కువగా ఉన్నట్లయితే ఐదు తులసి ఆకులు అలాగే ఐదు మిరియాలను ప్రతిరోజు తింటున్నట్లు అయితే మూడు రోజుల్లోనే మలేరియా జ్వరం తగ్గుముఖం పడుతుంది.
పిప్పిళ్ళు ,మానిపసుపు ,  జీలకర్ర , వెల్లుల్లి , నారింజ పిందెలు , శొంఠి , తులసి ,  ఆకుపత్రి , వావిలి వ్రేళ్ళు  వీటిని సమాన భాగాలుగా తీసుకొని, చూర్ణించి పూటకు అరతులం చొప్పున ఇచ్చినా చలిజ్వరములు తగ్గుతుంది

మలేరియా జ్వరం ప్రతి సంవత్సరం వచ్చి పీడిస్తున్నట్లయితే కొన్ని తులసి ఆకులను , మిరియాలను వేడి నీటిలో ఉడికించి అందులో కొద్దిగా బెల్లం, నిమ్మరసం కలిపి తాగినా కూడా మలేరియా జ్వరం నుంచి తప్పించుకోవచ్చు.

అంతేకాదు తులసి మొక్క యొక్క వేళ్ళను కషాయంగా చేసి మలేరియా జ్వరం వచ్చిన వారిచేత తాగించడం వల్ల  శరీరంలో చెమటలు పట్టి త్వరగా జ్వరం తగ్గుతుంది.

ప్రతిసారి మలేరియా జ్వరం వస్తున్నప్పుడు అల్లం రసం, పుదీనా రసం, తులసి ఆకుల రసం 5 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

అంతే కాదు ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటూ , ప్రతిరోజు కావలసినన్ని గోరువెచ్చని నీటిని సేవిస్తూ ఉండాలి. ఈ పద్ధతులు పాటిస్తే మలేరియా జ్వరం ఇట్టే పరార్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: