ప్రస్తుత కాలంలో చాలామంది అజీర్ణ సమస్యలతో సతమతమవుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా సరిగా తినకపోవడం మరియు ఇతర కారణాల వల్ల చాలామందికి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు తలెత్తుతాయి నేపథ్యంలో అనేక చిట్కాలు పాటిస్తున్నారు ప్రజలు. అలాగే వివిధ రకాల మాత్రలను కూడా మింగేస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చును. అది ఎలాగో చూద్దాం.

పుదీనా టీ : మనం ప్రతిరోజూ పరగడుపున కొద్దీ నాటి తీసుకుంటే చాలా ఆరోగ్యం. పేపర్ మెంట్ లో లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు సెప్టిక్ గుణాలు ఉండటం కారణంగా మన జీర్ణ వ్యవస్థ సరిగా ఉంటుంది. అలాగే... జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి మజిల్స్ ను కూడా చాలా చాలా ఫ్రీ చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయం పూట పుదీనా టీ తాగితే మంచిది.

పెరుగు : ప్రస్తుత జనరేషన్ లో పెరుగు తినడానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడరు. అయితే ప్రతి ఒక్కరు పెరుగు తినడం కారణంగా కడుపులో ఉండే సమస్యలన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా పెరుగు తినడం కారణంగా మీరు అతిగా తిన్న దానిని... లోపల సెట్ చేస్తుంది. తాజా పెరుగు తింటే మంచిది.

చల్లటి పాలు తాగండి : నిత్యం మనం పాలు వేడివేడివే తాగుతాము. అయితే వీటిని తాగకుండా చల్లటి పాలు తాగితే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు పాల ద్వారా చెక్ పెట్టవచ్చు. పాలలో ఉండే కొన్ని పోషకాలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రిట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది.

తిన్న తర్వాత నడవాలి : చాలామంది అన్నం తిన్న వెంటనే పడుకుంటారు. అయితే అలా చేయడం ముమ్మాటికి తప్పు. మనం అన్నం తిన్న తర్వాత కనీసం పదిహేను నిమిషాలపాటు నడవాలి. అలా నడవడం కారణంగా లోపల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాగలుగుతుంది. కాబట్టి ప్రతి రోజు అన్నం తిన్న తర్వాత నడవడం మంచిది. పైన చెప్పిన చిట్కాలు ప్రతిరోజు పాటిస్తే  సమస్యలు దరిచేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: