ద‌క్షిణాప్రికా దేశంతో  స‌హా ప‌లు దేశాల‌లో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్ బీ.1.1.529 పై కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌ను ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తం చేసింది. ముఖ్యంగా విదేశీ ప్ర‌యానికుల విష‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించింది. విదేశాల నుండి వ‌చ్చే ప్ర‌యాణికులకు ప‌క‌డ్భందీగా స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల‌ను త‌ప్ప‌కుండా నిర్వ‌హించాల‌ని ఆదేశించిన‌ది. అదేవిధంగా కచ్చితంగా కోవిడ్‌-19 పరీక్ష‌ల‌ను చేయాల‌ని సూచించింది కేంద్ర‌ప్ర‌భుత్వం.

ముఖ్యంగా ద‌క్షిణాప్రికా, హాంకాంగ్ నుంచి వ‌చ్చే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య శాఖ  కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల అద‌న‌పు చీఫ్ సెక్రెట‌రీలు, ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన  కార్య‌ద‌ర్శిలకు లేఖ‌లు రాసారు. విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులతో క‌లిసి మెలిసి మెలిగిన వారిని కూడా ట్రాక్ చేసి కేంద్ర ఆరోగ్య‌శాఖ జారీ చేసిన నిబంధ‌న‌కు అనుగుణంగా వైద్య‌ప‌రీక్ష‌ల‌ను వెంట‌నే నిర్వ‌హించాల‌ని సూచించారు.

అదేవిధంగా వీసా ప‌రిమితుల‌ను త‌గ్గించ‌డం, అంత‌ర్జాతీయ ప్ర‌యాణంపై ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన త‌రుణంలోనే ఈ వేరియంట్ వ్యాప్తికి అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని పేర్కొన్నారు. ద‌క్షిణాప్రికాలో అసాధార‌ణ రీతిలో మ్యుటేష‌న్ల‌కు గుర‌వుతున్న  బీ.1.1.529  నూత‌న ర‌కం వేరియంట్‌ను వైద్య‌రంగ నిపుణులు ఇటీవ‌లే గుర్తించారు. ఈ వేరియంట్ ప్ర‌భావాన్ని అంచెనా వేసేందుకు ఇప్ప‌టికే ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం అప్ర‌మ‌త్తం అయింది.

నూత‌న వేరియంట్ పై చ‌ర్చించేందుకు ప్రత్యేకంగా స‌మావేశ‌మైంది. మ‌రోవైపు కోవిడ్ దాటికి ఇప్ప‌టికే చాలా దేశాలు ప్ర‌పంచ వ్యాప్తంగా కుదేల‌వ్వ‌డం, ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చిన‌ట్ట‌యితే ద‌క్షిణాప్రికా కాస్త త‌క్కువ‌గానే ఉన్న విష‌యం తెలిసిన‌దే. కానీ ద‌క్షిణాఫ్రికా పొరుగుదేశ‌మైన బొత్సువానాలో కొత్త‌ర‌కం వేరియంట్‌ను శాస్త్రవేత్త‌లు గుర్తించ‌డం.. ఇప్ప‌టికే ఈ వేరియంట్‌కు సంబంధించి దాదాపు 22 కేసుల‌ను ద‌క్షిణాఫ్రికా అంటువ్యాధుల కేంద్రం గుర్తించిన‌ట్టు వెల్ల‌డించింది.    



 


మరింత సమాచారం తెలుసుకోండి: