మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి. శీతాకాలంలో స్వీట్ పొటాటో స్ ను తినడం వల్ల బాగా అధిక పోషకాలను సులువుగా పొందవచ్చట. ఈ స్వీట్ పొటాటో స్ మనకు దొరికే ఎటువంటి సాధారణ బంగాళదుంప కంటే అధిక ఎక్కువ మొత్తంలో చక్కెర స్థాయిని కలిగి ఉంటాయి. కానీ వాటి పోషక విలువలను కూడా అంతే స్థాయిలో ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు వాటి గురించి ఓక సారి తెలుసుకుందాం.

చిలకడ దుంపలు ఎక్కువగా ఫైబర్, పొటాషియం, విటమిన్ A ఉంటాయట. వారంలో కనీసం రెండు రోజులు అయినా వీటిని తీసుకుంటే.. మలబద్దక సమస్య నుండి  విముక్తి పొందేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా రోగ నిరోధకశక్తిని పెంచడంలో బాగా దోహదపడుతుంది.

ఇక ఖర్జూరపండు విషయానికి వస్తే.. శరీరంలోని ఉండేటువంటి అధిక కొవ్వు పదార్థాలను తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఖర్జూర పండ్లు పోషకాలకు పెట్టింది పేరు. ఇక వీటిని ఎక్కువగా జిమ్ము చేసేటటువంటి వారు తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటారు. వీటిని ఈ కాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం చల్లబడ కుండా ఉంటుంది.

చలికాలంలో బాదం, వాల్ నట్స్ ప్రతీరోజు తీసుకోవడం వల్ల, మన మెదడులో ఉండేటువంటి నాడీవ్యవస్థ చురుకుగా పని చేస్తుందట. వీటితో పాటు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బాగా సహాయపడుతుంది.

రాగి పిండితో చేసే టువంటి జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి క్యాల్షియం శరీరానికి బాగా అందుతుంది. అందుచేతనే వారికి మధుమేహం, రక్తహీనత సమస్య నుండి విముక్తి పొందుతారు.

ఈ కాలంలో ఎక్కువగా బయట దొరికే ఎటువంటి ఆకు కూరలు తినకూడదు. ఎందుచేత అంటే ఎక్కువగా బ్యాక్టీరియా వంటివి ఈ ఆకుల మీద ఉంటాయి కనుక వీటిని తినకపోవడమే మంచిది.

అందుచేతనే కాలాన్ని బట్టి మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి కొంతమంది వైద్యులు తెలియజేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: