గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు  విపరీతంగా పెరిగి పేద ప్రజలపై మోయలేని భారాన్ని మోపాయి. దీనికి తోడుగా టమాటో ధరలు కూడా ఆకాశానికి అంటీ మోయలేని భారం మోపాయి. గత వారం రోజులుగా ఈ ధరలు పెరగడం వలన ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం టమాటా  తెలుగు రాష్ట్రాలనే కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ మాటే. నెలరోజుల్లోనే టమాట ధరలు,పెట్రోల్ ధరలను దాటేసి రికార్డు సృష్టించాయి.  హోల్ సెల్ మార్కెట్ లలోనూ వంద రూపాయలు పెడితే కిలో టమాటా దొరకని పరిస్థితి. అయితే వారం రోజుల్లోనే సీన్ రివర్స్ అయింది. టమాట ధరలు సగానికిపైగా పడిపోయాయి. ముఖ్యంగా జిల్లా మదనపల్లి మార్కెట్  లో కిలో 130 పలికిన గ్రేడ్-1 టామాట ఇప్పుడు 60కి పడిపోయింది. ఇక గ్రేడ్-2 టమాటా అయితే మరీ దారుణంగా 10 కి తగ్గింది. రేట్లు పెరగడం తో లాభాలు వస్తాయని ఆశించిన రైతులు  పడిపోయిన ధరలతో డీలా పడిపోతున్నారు. అటు జిల్లా పత్తికొండ మార్కెట్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ వంద రూపాయలు పలికిన టమాట ఇప్పుడు ముప్పైకి పడిపోయింది.

 ఇతర రాష్ట్రాల నుంచి భారీగా టమాటా పంట ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి వస్తుండడంతో ధరలు పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ధరలు తగ్గేంత వరకు భారీ స్థాయిలో సరుకు మార్కెట్ కు వస్తుందా లేదా దళారులు కుమ్మక్కై ధరలు తగ్గించేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అధిక ధరలపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది.  ఈ ఏడాది ఎంత శాతం ధర పెరిగిందో చెబుతూ దాన్ని కిందకు దించడానికి చేపట్టవలసిన చర్యలు కేంద్ర ఆహార వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే రెండు నెలలపాటు టమాట ధరలు ఆకాశంలోనే విహరిస్తాయని జనవరి తర్వాతనే టమాట ధరలు కొద్దిగా దిగి వస్తాయని క్రీసిల్ ఆధారాలతో కూడిన అంచనాలు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: