కరోనా భయం వద్దు, కేవలం ముందస్తు జాగర్తలు ముద్దు. మరోసారి కరోనా వేరియంట్ పై ప్రపంచదేశాలు హెచ్చరికలు జారీచేశాయి. దీనితో ప్రజలు మళ్ళీ భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు ఉన్న వేరియంట్లలో డెల్టా చాలా త్వరగా వ్యాప్తిస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడిన వేరియంట్ కేవలం ఒక్క రోజులో వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని వైద్యశాఖ స్పష్టం చేసింది. అందువలన జనాభా ఎక్కువ ఉన్న దేశాలు ముందస్తు జాగర్తలు పాటించడం చాలా అవసరం. ఒక్కసారిగా అందరు వచ్చి ఆసుపత్రులలో పడితే ఎలా ఉంటుంది ఇప్పటికే రెండో వేవ్ లో చూశాం కాబట్టి మరికొంత కాలం ముందస్తు జాగర్తలు పాటిస్తూ ఉండటం ద్వారా కరోనా నుండి రక్షించుకోవచ్చు.

ఆందోళన కన్నా, ప్రశాంతంగా ముందు జాగర్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కడో ఎదో అయ్యిందని మనం భయపడటం కాకుండా ఇక్కడ వరకు రాకుండా జాగర్తలు తీసుకోవడం మంచిది. ఇప్పుడే కాస్త కోలుకుంటూ అందరూ బయటకు వస్తున్న నేపథ్యంలో మరికొంత కాలం ఈ జాగర్తలు పాటించడం ద్వారా కొత్త రకాల నుండి బయటపడవచ్చు. మన నిర్లక్ష్యం మనతో పోదు అనేది ఇంతకుముందే చూశాం. పోయినవాళ్లు తిరిగిరారు కానీ వాళ్ళ నుండి కాస్త నేర్చుకొంటే వారి పోకడకు కాస్త అర్ధం ఉంటుంది. ఇంకొన్నాళ్ళు జాగర్తగా ఉండగలిగితే అనేది ఇక్కడ కనిపించకపోవచ్చు, కానీ తప్పదు. కరోనా మన దేశం నుండి మాత్రమే పోతే సరిపోదు, అది పూర్తిగా ప్రపంచం నుండి పోతేనే ప్రమాదం సున్నా అనినట్టు.

ఎందుకంటే, ప్రపంచ దేశాల నుండి కావచ్చు, మనమే వివిధ దేశాలకు కావచ్చు విహార యాత్రలు అంటూ వెళుతున్నాం. గత కొంతకాలంగా ఇంట్లోనే ఉండి ఉండి కూడా అలా బయటకు వెళ్ళొద్దాం అని వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీళ్ళ ద్వారా వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువ, అందుకనే మన దేశంలోనే కాదు, ప్రపంచంలో నే కరోనా కనిపించకుండా పోయేంత వరకు జాగర్తలు పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. కాదు కూడదు అంటే ఎవరికీ ఏమి పోదు, మీరే పోగొట్టుకోవాల్సి రావచ్చు, అంతకు మించి లోకానికి ఏమి నష్టం ఉండబోదు. మీ జాగర్త, దేశం ఆరోగ్యం, ప్రపంచ ఆరోగ్యం కూడా. భయాన్ని, ఆందోళనలను వీడి, కేవలం ముందస్తు జాగర్తలతోనే కరోనా ను తరిమికొడదాం!

మరింత సమాచారం తెలుసుకోండి: