ఇటీవలి కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పరుగులు పెడుతున్న ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి అన్న విషయాన్ని మరిచిపోతున్నారు.  దీంతో నేటి రోజుల్లో జీవనశైలి కారణంగా కూడా ఎంతో మంది వివిధ రకాలఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చివరికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రోజు రోజుకి  ప్రతి ఒక్కరిలో ఆరోగ్య సమస్యలు పెరిగి పోతూనే ఉన్నాయ్. అయితే ఇటీవల కాలంలో అయితే గుండెపోటు అనేది ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా మారిపోయింది.


 అయితే సాధారణంగా చాలా మంది గుండెపోటు లక్షణాలు ఏంటి అని తెలియక అపోహలకు గురి అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించినా  అవి గుండెపోటు లక్షణాలు ఏమో అని భావిస్తూ భయపడిపోతుంటారు చాలా మంది. ముఖ్యంగా ఛాతిలో మంటగా ఉండడం లాంటివి జరిగినప్పుడు కూడా గుండెపోటు రాబోతుందేమో  అని భయం ఆందోళనకు గురవుతూ ఉంటారు. గుండెపోటు వచ్చే ముందు చాలా మందిలో కొన్ని రకాల అరుదైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అంటూ చెబుతున్నారు నిపుణులు. ఇక ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఎంతో మేలు అంటూ సూచిస్తున్నారు.


 శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తడం లేదా ఛాతీలో నొప్పి రావడం లాంటి లక్షణాలు గుండెపోటు వచ్చే ముందు కనిపిస్తాయట. అంతే కాకుండా చిన్న పనులకే నీరస పడి పోవడం కొద్దిగా నడిచిన కూడా ఆయాసం వస్తుంటే ఎంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. కొందరిలో ముందు దవడ,  మెడ,  జీర్ణాశయం భాగంలో కూడా నొప్పి గా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇక 1,2 రోజులకు మించి ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో నొప్పి వస్తే అది గుండెపోటు లక్షణంగా భావించాలి. ఇలా పైన తెలిపిన లక్షణాల లో ఏ  ఒక్కటి కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఎంతో మేలు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: