క‌రోనా వైర‌స్ ఒమిక్రాన్ రూపంలో ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే ప‌లు దేశాలకు వ్యాపించింది. బ్రిట‌న్‌లో మూడో కేసు బ‌య‌ట‌ప‌డింది. దీంతో పలు దేశాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాలు అయితే అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌ను నిషేధించింది. ఈ కొత్త వేరియంట్ ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్ల‌డించింది. ఈ ప‌రిస్థితి చాలా వేగంగా మారుతోంది. ఒమిక్రాన్ జ‌న‌టిక్ ప్రొఫైల్ ఆందోళ‌న కలిగిస్తోంది. అయితే, ఈ వేరియంట్ వ‌ల్ల క‌లిగే ప్ర‌మాదం ఏంటో చెప్పేందుకు దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రి ద‌గ్గ‌ర లేవు.


    ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైర‌స్.. ఆ త‌రువాత ప‌లు దేశాల‌కు వ్యాపించింది. ఆస్ట్రేలియా, ఇటలీ, జ‌ర్మ‌నీ, నెద‌ర్లాండ్స్‌, బ్రిట‌న్‌, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌, బాట్స్‌వానా, బెల్జియం దేశాలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. బి.1.1.529 (ఒమిక్రాన్‌) డెల్టా కంటే శ‌ర‌వేగంగా విస్త‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఈ వేరియంట్‌ను డ‌బ్ల్యూహెచ్ఓ `వేరియంట్ ఆఫ్ క‌న్స‌ర్న్‌`గా గుర్తించింది.  అయితే, ఒమిక్రాన్ విషయంలో పూర్తిగా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేన‌ప్ప‌టికీ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు..

   కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ డెల్టా వైర‌స్ కంటే వేగంగా వ్యాపిస్తుంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఒమిక్రాన్ వైర‌స్‌కు స్ప‌ష్ట‌మైన ల‌క్ష‌ణాలు లేవ‌ని తెలుస్తోంది. కానీ, ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్న వారిలో ఈ ల‌క్ష‌ణాలు గుర్తించారు. వైర‌స్ సోకిన వారి మొద‌ట్లో అల‌సిపోయిన‌ట్టు అనిపించ‌డం.. తిమ్మిర్లు, కొంచెం గొంతు నొప్పి, పొడి ద‌గ్గు, అలాగే కొంచెం జ్వ‌రం, కండ‌రాల నొప్పి ఉంటుంద‌ని ద‌క్షిణాఫ్రికా వైద్యుడు వెల్ల‌డించారు. ఈ వైర‌స్ సోకిన వారికి దాదాపుగా చికిన్ గున్యా లాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. గ‌తంలో క‌రోనా సోకిన వారికి, రెండు డోసులు టికా తీసుకున్న వారికి కూడా ఈ వైర‌స్ సోకే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.






 


మరింత సమాచారం తెలుసుకోండి: