దక్షిణాఫ్రికాలో కనిపించిన కొత్త వైరస్ ప్రపంచానికి వ్యాపించడం ప్రారంభించింది. అందుకున్నదానికంటే త్వరగా ఈ వైరస్ ఆయా దేశాలకు వ్యాప్తి చెందుతుంది. మొదటి నుండి దీనితో ప్రమాదం అని చెపుతున్నప్పటికీ ఆయా దేశాలు హడావుడిగా అంతర్జాతీయ విమానాశ్రయాలపై ఆంక్షలు విధించలేవు కాబట్టి కొంత వ్యాప్తి తప్పని స్థితి. అయినప్పటికీ తగిన జాగర్తలు ఆయా విమానాశ్రయాలలోనే పాటిస్తూ, మళ్ళీ గతంలోలాగా కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. దీనితో ఆయా దేశాల నుండి వచ్చిన వారికి ఖచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ తప్పని సరి చేయడం ఒక్కటే ఇందుకు ముందస్తు జాగర్త అవుతుంది. అదే అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే 20కి పైగా దేశాలకు కొత్త వైరస్ వ్యాప్తి చెందింది. యూరప్ దేశాలలో కూడా పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే జాగత్త వహించినట్టుగా చెప్పుకుంటున్న అమెరికా లో కూడా ఈ కేసులు కనిపిస్తున్నాయి. తాజాగా భారత్ లోని కర్ణాటకలో విదేశీ ప్రయాణికుడికి ఈ తరహా వైరస్ సోకినట్టు గుర్తించారు. అలాగే హైదరాబాద్ లో కూడా ముగ్గురికి పాజిటివ్ రాగా వాళ్లకు సోకిది కొత్త రకమా కాదా అనేదానిని పరీక్షించడానికి ల్యాబ్ కు శాంపిల్స్ ను పంపడం జరిగింది. మొదటి నుండి మోడీ ఈ వైరస్ పై ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూనే ఉన్నారు.

దేశంలో ఒక కేసు కూడా రాకుండా చూడటం సాధ్యం  కాకపోయినప్పటికీ, నిబంధనలు కఠినంగా పాటించడం చాలా అవసరం అనేది అందరు గ్రహించాల్సి ఉంది. ఇప్పటికే మరోసారి నిబంధనలు పాటించాల్సిందని ప్రజలకు కూడా ఆయా అధికారులు స్పష్టం చేశారు. ఒక్క రోజులో తీవ్రంగా వ్యాపించే రకంగా దీనిని గుర్తించారు కాబట్టి, కఠినంగా నిబంధనలు పాటించడం చాలా అవసరం. అలాగే తగిన దూరం పాటించడం కూడా అవసరం. కొన్నాళ్ళు మళ్ళీ కరోనా వచ్చిన కొత్త  లో పాటించినట్టుగా నిబంధనలు పాటించాల్సిందే. ఎయిర్ పోర్టులలో కూడా ఒకవేళ పాజిటివ్ వస్తే, వారి 14 రోజుల హిస్టరీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని నిబంధన కఠినతరం చేశారు. ప్రస్తుతం కనుగొన్న కొత్త బాధితుల వద్ద కూడా ఈ సమాచారం సేకరిస్తూ, వారి ద్వారా ఇంకెంతమందికి ఈ వైరస్ సోకి ఉండొచ్చు అనేదానిపై సమాచారం సేకరిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: