భారత్ మొదటి దశ కరోనా సమయంలో తాను ఉత్పత్తి చేసిన వాక్సిన్ ను ప్రపంచానికి వితరణ చేసిన విషయం తెలిసిందే. దానితో భారత్ కు మంచి పేరు వచ్చిందనే ఉద్దేశ్యంతో తాజాగా చైనా కూడా తన వాక్సిన్ ను దక్షిణాఫ్రికా కు పంపించింది. ఇప్పటికే ప్రపంచం దృష్టిలో దోషిగా ముద్రపడిన చైనా ఇలాంటి పనులను చేయడం ద్వారా మరోసారి ప్రపంచం దృష్టిలో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నట్టుగానే ఉంది. గతంలో కూడా తన మీద ఆధారపడ్డ పాక్ లాంటి దేశాలకు చైనా వాక్సిన్ లు పంపింది కానీ, ఇంత భారీగా పంపింది లేదు. ఒకవేళ ప్రపంచానికి అది అంటుకుంటే, దానికి తిప్పలు తప్పవేమో అనే ఉద్దేశ్యంతో కూడా ఈ పంపిణి జరిపి ఉండొచ్చు. అంతేకాని చైనా లో మార్పులు వస్తున్నాయని మరోసారి ప్రపంచం దానిని దగ్గర చేసుకుంటే ఇక అంతే.

ఇటీవల కొత్త వేరియంట్ తో అల్లాడుతున్న దక్షిణాఫ్రికాలో కేసులు రానురాను పెరిగిపోతుండటంతో భారత్ వాక్సిన్ లను ఆ దేశానికి ఎగుమతి చేసింది. గతంలో ఉచిత వితరణ చేసినప్పటికీ ఈ సారి భారత్ వాక్సిన్ లను ఎగుమతి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చింది. బహుశా అందుకే చైనా ఉచితంగా వితరణ చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా భారత్ లా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించగలడేమో చైనా కానీ, అది కుదరదు. భారత్ లో ఆ గుణం స్వాభావికంగా ఉన్నది, చైనా దానిని అలవర్చుకుని చేయడం సాధ్యం కానీ పని. ఉన్నట్టుండి పాము సాధుజంతువు కాజాలదు అనేది పెద్దల మాట.

కరోనా వాక్సిన్ రెండు డోసులు వేసుకోవడం ద్వారా ప్రస్తుత వేరియంట్ నుండి కూడా బయటపడవచ్చు అనేది ఇప్పటీకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. మొదటి నుండి కరోనా ను ఎదుర్కోవడానికి ముందస్తు జాగర్తలు తప్ప మరొకటి అవసరం లేదని ఆరోగ్య సంస్థ చెపుతూనే ఉంది. అయినా కాస్త కరోనా నెమ్మదించగానే ప్రజలు సాధారణ జీవితంలోకి వచ్చేస్తుండటంతో, ప్రస్తుత పరిణామాలు వచ్చాయి. మరోసారి ప్రజలు పూర్తిగా కరోనా ప్రపంచం నుండి పోయేవరకు జాగర్తలు పాటిస్తూ ఉంటె, దానిని తరిమికొట్టడం సాధ్యం అవుతుందని స్పష్టం చేసింది ఆరోగ్య సంస్థ. వాక్సిన్ కూడా ఆయా దేశాల పద్దతిని బట్టి ఒకటి లేదా రెండు డోసులు వేసుకొని తీరాల్సి ఉంది. వాక్సిన్ తీసుకున్న తరువాత కూడా జాగర్తలు పాటించాల్సి ఉంది. ఈ రెండు కరోనా ను దరి చేరనీయవు.

మరింత సమాచారం తెలుసుకోండి: