భారతదేశంలో కరోనా కాస్త తక్కువ కాగానే అధికారికంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర వ్యవస్థలు సాధారణంగా పనిచేయడం ప్రారంభించాయి, అయితే అక్కడ ఖచ్చితంగా కరోనా జాగర్తలు పాటించాల్సిందే అనే నియమం మాత్రం ఉంది. ముందు నుండి కూడా అంటే లాక్ డౌన్ తరువాత నుండి అందరికి ఈ తరహా జాగర్తలు చెపుతూనే ఉన్నారు. కరోనా ప్రపంచాన్ని వీడేంత వరకు ఎక్కడైనా సరే జాగర్తలు(మాస్క్ ధరించడం, నిర్ణిత దూరం పాటించడం, శానిటైజర్ వాడటం లాంటివి) పాటించాలని చెపుతూనే ఉన్నారు. కానీ అవేమి సరిగ్గా పాటించకపోవడం వలన రెండో వేవ్ లో ప్రమాదఘంటికలు మోగిన విషయం చూశాం.

అవన్నీ కళ్లారా చుసిన తరువాత కూడా ప్రజలు, ఆయా వ్యవస్థలు, అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. అయితే ఏంటి అనుకోవడానికి, ఇదేమి వారి నిర్లక్ష్యం వారికే చేటు చేస్తుందిలే అనుకునే సందర్భం కాదు, ఒకరి నిర్లక్ష్యం ప్రతి వారికీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే అందరు బాధ్యత తీసుకోవాల్సిందే. అలాంటి బాధ్యత లేకుండా ఉంటె, అది తిరిగి తిరిగి తనమీదకి రావడానికి పెద్ద సమయం పట్టదు. అది ప్రస్తుత వేరియంట్ అయితే కేవలం ఒక్కరోజు చాలని నిపుణులు ఒకపక్క చెపుతూనే ఉన్నారు. భారత్ లో ఆయా వ్యవస్థలలో నిర్లక్ష్యం ఉన్నమాట వాస్తవం. అది ఇప్పుడు కూడా అంతే ఉంటె చాలా ప్రమాదం.

తాజాగా ఒడిశాలో ఒక కళాశాలలో విద్యార్థులకు పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్ అని వచ్చింది. అలాంటి వారిని క్వారంటైన్ లో ఉంచాలి, వారిని ఎవరు కలవడానికి వచ్చినప్పటికీ, వారు కూడా కరోనా నిబందబలు పాటిస్తూ ఉండాలి. అలాంటివి ఏమి లేకుండా అక్కడ విచ్చలవిడిగా వాతావరణం ఉండటం తనిఖీ అధికారులు గమనించారు. దీనితో యజమానిపై కేసు నమోదు చేశారు. కేసు కాదు ఇక్కడ ప్రదానం, ఆ నిర్లక్ష్యం చాలా ప్రమాదం. గత వారంలో నలుగురికి మాత్రమే ఉన్నది, వాళ్ళ నిర్లక్ష్యం వలన 33కి చేరింది, ఆ తరువాత వారంలో 19మందికి పాకింది. ఇది ప్రమాదం. పొరపాటున వాళ్లకు ఏమైనా అయితే బాధ్యత ఎవరు తీసుకుంటారు. అదే కొత్త వేరియంట్ విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి ఏమిటి! జరా జాగర్త, నిర్లక్ష్యం ఒక్కరు వహించినా, అందరి ప్రాణాల మీదకు తెస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: