కొంతమంది తరచుగా కడుపునొప్పి వాంతులు అలసట అంటూ ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. అంతే కాదు వారి ఆరోగ్యం కూడా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది. దీనికి పలు కారణాలు ఉండొచ్చు. అయితే వ్యాధి అర్థం కాకుండా ఉందంటే ముందుగా వైద్యులను సంప్రదించాలి. కొన్ని ఆరోగ్య సమస్యల విషయం లో సొంత వైద్యం పనికి రాదన్న విషయం తెలిసిందే. కడుపు నొప్పి సమస్య ఎక్కువగా పేస్ చేస్తున్న వారు తమ సమస్యకు సరైన కారణం ఏంటో వైద్యుల ద్వారా తెలుసుకోవాలి. అయితే అది కాలేయ వ్యాధికి కారణం అంటున్నారు వైద్యులు. కాలేయ పనితీరు క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుందని, ఈవ్యాధి సైలెంట్ కిల్లర్ అని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ వ్యాధి కి సరైన సమయంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం. దీనిని లివర్ సిరోసిస్ లేదా ఫ్యాటి లివర్ అని పిలవచ్చు. చాలా సందర్భాల్లో లివర్లో ఏదైనా అడ్డుపడడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వారు, ఊబకాయం తో ఇబ్బంది పడేవారు, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు ఈ సమస్యల నుంచి జాగ్రత్తగా ఉండాలి.

లక్షణాలు
కాలేయం సరిగా పని చేయకపోవడం కారణం గానే ఇలాంటి సమస్యలు వస్తాయట.  అయితే సరైన సమయంలో దీనిని గుర్తించకపోతే కాలేయ మార్పిడి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే తరచుగా కడుపు నొప్పితో బాధ పడితే కాలేయ పనితీరు పరీక్ష (ఎల్ఎఫ్టి) లేదా సరోజ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.

జాగ్రత్తలు
ఈ కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆహారంలో చక్కెర ఉప్పు పిండి వాడకాన్ని బాగా తగ్గించాలి. మద్యాన్ని మానేయాలి. తగిన మొత్తంలో ప్రొటీన్లు విటమిన్లు ఉండేలాగా చూసుకోవాలి. రోజుకు అరగంట వ్యాయామం చేయాలి. ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: