ప్ర‌స్తుతం ప్రపంచాన్ని భ‌య‌పెడుతున్న కొత్త వేరియంట్ భార‌త‌దేశంలోకి ప్ర‌వేశించింది. ఇప్ప‌టికే ప‌లు ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఇంకా రానున్న రోజుల్లో కేసులు ఒమిక్రాన్ కేసులు పెరుగుతాయి. ఈ ప‌రిస్థితుల్లో థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందా అనే ప్ర‌శ్న‌ ముందుకు వ‌స్తోంది. గ‌తంలో అక్టోబ‌ర్ లో థ‌ర్డ్ వేవ్ రావోచ్చ‌ని చాలామంది నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. కొంతమంది డిసెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు కూడా థ‌ర్డ్ వేవ్ రావొచ్చ‌ని అంచ‌నా వేశారు. అలాగే, భార‌త ప్ర‌భుత్వం కూడా థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది. అస‌లు వేవ్స్ అంటే ఏమిటి..? క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగి, బాగా త‌గ్గి మ‌ళ్లీ పెరిగితే వేవ్స్ అంటారు.


  అంటే మొద‌టి వేవ్‌లో కేసులు బాగా న‌మోద‌య్యి మ‌ళ్లీ మార్చ్, ఏప్రిల్‌లో కేసులు విప‌రీతంగా పెర‌గ‌డం వ‌ల్ల రెండో ఉధృతి వ‌చ్చింది. ఇప్పుడు గ‌ణ‌నీయంగా కేసులు త‌గ్గి మ‌ళ్లీ విప‌రీతంగా కొత్త కేసులు పెరిగితే థ‌ర్డ్ వేవ్ అంటారు. అయితే, భార‌త‌దేశంలో రెండు వేవ్‌లు వ‌చ్చి.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా పూర్త‌వుతున్న క్ర‌మంలో.. వ‌చ్చిన డెల్టా వేరియంట్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో థ‌ర్డ్‌వేవ్ రాద‌నే ఆశ‌లు చిగురించాయి. కానీ, ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగు చూడ‌డంతో మూడో ముప్పు త‌ప్ప‌దా అనే చ‌ర్చ మొద‌ల‌యింది.

 

 ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా అంత తీవ్ర ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చ‌న్న‌ది అంచ‌నా. కానీ, ఈ కొత్త వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తోంది. అయితే, దేశ ప్ర‌జ‌ల్లో ఇమ్యూనిటీ ఎక్కువ‌గా ఉండ‌డం, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా వేగంగా జ‌ర‌గ‌డం, దీంతో పాటు ఒమిక్రాన్ తీవ్ర‌మైన వ్యాధి కాద‌ని తెలుస్తోంది. ఒకవేళ థ‌ర్డ్ వేవ్ వచ్చినా స‌రే అది రెండో ఉధృతిలో సృష్టించిన బీభ‌త్సం అంత ఉండ‌క‌పోవ‌చ్చ‌నే అంచ‌నాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ స్థాయిలో మ‌ర‌ణాలు, ఆక్సిజ‌న్ కొర‌త, ఐసీయూ బెడ్ల అవ‌స‌రం ప‌డ‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, వైర‌స్ ప్ర‌భావం ఎలా ఉంటుందో  అంచ‌నా వేయలేం కాబట్టి ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డా వాటిని త‌ట్టుకునేలా ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌జ‌లు స‌న్న‌ద్ధం అవుతూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: