మొక్కజొన్న అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వర్షాకాలంలో ఎక్కువగా వీటిని తినడానికి ఇష్టపడతారు. అతి తక్కువ ధరలకే లభించే ఆహారపదార్ధాలలో ఇది కూడా ఒకటి. వీటిని కాల్చుకొని, ఉడకబెట్టుకొని తినవచ్చు. లేదంటే వీటిని పాప్ కార్న్, లాగా అయినా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న లను బాగా పిండిగా ఆడించి వాటితో రొట్టెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది పోషకాహారలు చాలా బలమైన ఆహారం.

ముఖ్యంగా మొక్క జొన్నలు.. లినోలిక్ అనే ఆసిడ్ ఉంటుంది. ఇక ఇందులో B-6,B-1, విటమిన్ ఈ, వంటివి ఎక్కువగా ఉంటాయి. మొక్కజొన్న లో ఎక్కువగా పీచు పదార్థాలు బాగా లభిస్తాయి. అందుచేతనే ఈ జీర్ణక్రియ అవ్వడానికి సహాయం చేస్తాయి. మొక్కజొన్నతో మలబద్దకం, మొలలు వంటివి రాకుండా ఉండేందుకు చాలా సహాయ పడతాయి. ముఖ్యంగా పేగు వంటి సమస్యలను అరికట్టడానికి బాగా సహాయపడతాయి.

ఎముకలు దృఢంగా ఉండడానికి ఇందులో కాపర్, ఐరన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇక మినరల్స్ అన్ని మొక్కజొన్నలోని బాగా ఎక్కువగా లభిస్తాయి. ఎముకలకు కావలసిన మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్ వంటివి ఈ గింజల్లో ఎక్కువగా లభిస్తాయి. కిడ్నీలను కూడా చైనా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ గింజలు ఉపయోగపడతాయి. ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి కనీసం వారంలో రెండు సార్లయినా ఈ గింజలను తినడం వల్ల శరీరంపై ఉన్న ముడుతలు, చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఔషధంగా పనిచేస్తుంది.

మొక్కజొన్న లో లోపల ఉండే పదార్థం పోలిక్ యాసిడ్ కలిగి ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి విముక్తి పొందవచ్చు. తద్వారా గుండెపోటు రాకుండా ఉండడంతోపాటు.. పక్షవాతం, బిపి వంటివి దగ్గరకు రాకుండా అదుపులో ఉంచుతుంది. వీటిని ప్రతి రోజూ తింటే జుట్టు చాలా దృఢంగా ఉంటుందట. మొక్కజొన్నలు తిన్న వెంటనే శక్తి వెలువడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: