ఇప్పటికే కరోనాతో ఎంతో ఇబ్బందులు పడుతున్న దేశాలు, మరో వ్యాధితో కలవరపడుతున్నాయి. పాకిస్తాన్లో ఈ వ్యాధితో ఎంతో మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడి మరణిస్తున్నారు. మరి ఇది పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకుందామా..?
పాకిస్థాన్ లోని సిందిలో న్యుమోనియా కలకలం సృష్టిస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులు న్యూమోనియా బారినపడి మృతి చెందుతున్నారు. న్యుమోనియా బారినపడి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7462 మంది పిల్లలు మరణించిన్నట్లు సింథ్ ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించారు. పాకిస్తాన్ లోని చిన్నారులు న్యుమోనియా వ్యాధికి బలవుతున్నారు. 27136 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి మరణించినట్లు సింద్ ఆరోగ్య శాఖ అధికారి చెప్పారు. సింద్ లోని గ్రామీణప్రాంతాల్లో పిల్లలు పెద్దలతో సహా ఈ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్నారని, సుమారు 60 శాతం కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు.

ఇక ప్రావిన్స్ లోని 40 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రాణాంతక న్యుమోనియా వైరస్ కారణంగా 2021లో సింద్ లో7462 మంది పిల్లలు మరణించారు.  27 వేల 136 మంది ఐదేళ్ల లోపు పిల్లలు న్యుమోనియా బారిన పడ్డారు. యునిసెఫ్ లెక్కల ప్రకారం న్యుమోనియా బ్యాక్టీరియా, వైరస్ లు లేదా శిలీంద్రాల వల్ల వస్తుంది. పిల్లల ఊపిరితిత్తులు చీము, నీటితో నిండిపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి మరణిస్తారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మొత్తం పిల్లల మరణాలు 16 శాతం న్యూమోనియా వల్లనే మరణిస్తున్నారని తెలుస్తోంది. ఏదైనా ఇన్ఫెక్షన్ తో ఊపిరితిత్తులతో వాపు కలిగిస్తుంది. దీనినే న్యుమోనియా అంటారు. చాలావరకు న్యూమోనియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చినప్పటికి ఇన్ఫ్యోఎన్సా లేదా కోవిడ్ 19 వైరస్ వంటి వరల్డ్ ఇన్ఫెక్షన్లు కూడా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. కరోనా మహమ్మారి దీనికి సజీవ సాక్ష్యం. పెద్దలు, పిల్లలకు న్యూమోనియా ప్రాణాంతకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: