క‌రోనా విజృంభిస్తున్న వేళ వైర‌స్‌కు విరుగుడు ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది. ఒక్క వ్యాక్సిన్ మాత్ర‌మే. టీకానే శ్రీ‌రామ ర‌క్ష అన్న భావ‌న‌లు కూడా ఉన్నాయి. దీంతో ప్ర‌భుత్వాలు త‌మ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ వెలుగు చూసిన నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌జ‌ల‌కు బూస్ట‌ర్ డోసు ఇవ్వ‌డంపై ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ఇప్ప‌టికే చాలా దేశాల్లో బూస్ట‌ర్ డోస్ టీకా త‌మ ప్ర‌జ‌లకు అందిస్తోంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ కొవిడ్‌-19 వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య నిపుణులు పేర్కొవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీనికి కార‌ణం వైర‌స్ విస్తృత రూపంలో ప‌రిణామం చెంద‌డం. ఈ నేప‌థ్యంలో నాలుగు డోసుల టీకా తీసుకున్న ఓ మ‌హిళ‌ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.


  మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌యాణీకుల‌కు చేసిన ప‌రీక్ష‌ల్లో దుబాయ్ కి చెందిన ఓ మ‌హిళ‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. ఇత‌ర దేశాల్లో నాలుగు డోసులు టీకా తీసుకున్న ఓ మ‌హిళ (30) ఇటీవ‌వ‌ల ఇండోర్ కు వ‌చ్చింది.  నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్వ‌హించే కొవిడ్ ప‌రీక్ష‌ల్లో ఆమెకు పాజిటిగా నిర్ధార‌ణ‌యింది. నాలుగు రోజుల క్రితం జ‌లుబు, ద‌గ్గు వ‌చ్చింద‌ని ఆ మ‌హిళ పేర్కొంది. తీవ్ర ల‌క్షణాలేమి క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ముందు జాగ్ర‌త్త‌గా స్థానిక ఆస్ప‌త్రిలో చేర్పించామ‌ని ఇండోర్ చీఫ్ మెడిక‌ల్ అధికారి డా.భ‌రేసింగ్ సెథియా పేర్కొన్నారు.




 దుబాయ్ నుంచి 12 రోజుల క్రిత‌మే ఆ మ‌హిళ ఇండోర్‌కు వ‌చ్చింది. అనంత‌రం బంధువుల వివాహ కార్యక్ర‌మాల్లో పాల్గొంది. ఆ త‌రువాత తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏయిర్‌పోర్టుకు రాగా.. అక్క‌డ నిర్వ‌హించిన పరీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే, ఆ మ‌హిళ ఈ ఏడాది జ‌న‌వ‌రి, ఆగ‌స్టు మ‌ధ్య కాలంలో సినోఫామ్‌, ఫైజ‌ర్ టీకాల‌ను రెండేసీ డోసుల చొప్పున తీసుకున్న‌ట్టు తెలిసింది. అయితే, ఆ మ‌హిళ‌కు సోకింది క‌రోనా లేదా కొత్త వేరియంట్ నా అనేది అధికారులు వెల్ల‌డించ‌లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: