సాధారణంగా అయితే స్వెటర్లు అయితే శాలువాలతో చలిని తరిమి కొడుతుంటారు. అయితే కొంతమంది మాత్రం హీటర్లను ఉపయోగిస్తుంటారు. చలిగా ఉన్న వాతావరణాన్ని వేడిగా మార్చడం అనేది ఈ హీటర్ల పని.గాలిలోని తేమను గ్రహించి వేడిని పెంచుతాయి ఈ హీటర్లు. దీంతో విపరీతంగా ఉన్న చలి కూడా తగ్గుతుంది. అయితే చలి నుంచి కొంచం కాసేపు వేడి అయితే లభిస్తుంది కానీ.. ఇక ఇలాంటి హీటర్ల వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని మీకు తెలుసా.? హీటర్ల వినియోగం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..ఈ హీటర్లు చిన్న పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇక ముఖ్యంగా సాఫ్ట్ గా ఉండే చిన్నారుల చర్మంపై దద్దుర్లు అనేవి వస్తుంటాయి. అలాగే హీటర్ల నుంచి వచ్చే వేడి గాలిని పీల్చుకోవడం ద్వారా చిన్నారుల ముక్కు భాగంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి.ఇక గదులలో హీటర్లను ఉపయోగించడం వల్ల ఆక్సిజన్‌ శాతం కూడా తగ్గిపోతుంది.

దీంతో తలుపులు మూసిఉండి బయటకు గాలి లోపలికి ఇంకా లోపలి గాలి బయటకు వెళ్లకుండా ఉండే గదుల్లో ఉన్న వారికి వికారం ఇంకా తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి హీటర్లు వాడుతున్నప్పటికీ లోపలి గాలి బయటకు వెళ్లేలా పలు జాగ్రత్తలు చూసుకోవాలి.ఇక గదిలో ఉండే తేమను తగ్గించడమే ఈ హీటర్ల ముఖ్యమైన విధి. కాబట్టి వీటి కారణంగా చర్మంలోని తేమ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా చర్మంపై దురద ఇంకా అలర్జీలకు దారి తీస్తుంది. అంతేకాకుండా సాఫ్ట్ గా చర్మం ఉన్న వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది.సాధారణంగా ఈ హీటర్లు కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విష వాయువును కూడా విడుదల చేస్తుంది. ఈ వాయువులను నేరుగా పీల్చుకోవడం వల్ల మెదడుపై అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ హీటర్లు ఉన్న గదుల్లో ఉండకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: