ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం జీవితంలో ఏది సాధించాలన్నా ఏం చేయాలన్నా ముందుగా బాగుండాల్సింది మన ఆరోగ్యం. అది బాగుంటేనే ఏదైనా అనుకున్నది సాధించగలం. అలాంటి ఆరోగ్యంపైన దృష్టి సారించకుండా ప్రస్తుత సమాజంలో ఆస్తులు, అంతస్తులు అంటూ వాటి వెంబడే పరిగెడుతున్నారు. చివరికి ఆరోగ్యం క్షీణించి మరణిస్తున్నారు. కోటి చదువులు కూటి కోసమే అన్న సామెతను ప్రతి ఒక్కరూ  గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఆరోగ్యం పైనే మనం ఎంత శ్రద్ధ చూపితే అంత ఎక్కువ బతుకుతాం. అయితే మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మాంసాహారం తీసుకునే వారిలో కంటే శాఖాహారం తీసుకొనే వారే చాలా ఆరోగ్యంగా ఉంటారు.

 మాంసాహారం తీసుకునే వారిలో ఉబకాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా బ్రిటన్లో గుండెజబ్బుల ప్రభావానికి గురైన వారిలో 4 లక్షల 20 వేల మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధ్యయనం చేశారు. శాకాహారం తినే వారు గుండెజబ్బులతో చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉన్నదని అంటున్నారు. గ్యాస్గో యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఈ యొక్క పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను  హార్ట్ జర్నల్ లో  ప్రచురించారు. పేస్కాటీరియన్ డైట్ పాటించడం వలన గుండెజబ్బుల ప్రభావం తగ్గించవచ్చని వారు చెబుతున్నారు. ఇతరులతో పోల్చి నప్పుడు మాంసం ఎక్కువగా తినే వారిలో 94.8% మందికి ఉబకాయం మరియు గుండె జబ్బుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్నదని, అలాగే చేపలు తినేవారిలో  గుండె జబ్బులు ఇతర వ్యాధులకు  గురయ్యే అవకాశాలు చాలా తక్కువని వారు తెలియజేశారు.

 వీటికంటే ప్రమాదకరమైన పిజ్జాలు, బర్గర్లు, డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ తినే వారిలో ఇంకా ఎక్కువగా గుండెజబ్బులు వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని  తెలియజేశారు. మాంసానికి బదులుగా చేపలను ఎక్కువగా తినాలని అధ్యయన బృందాల సభ్యులు జిల్ పెల్ చెబుతున్నారు. అయితే చేపలను తినడం వలన n-3 కొవ్వులు మనల్ని ఈ ప్రమాదం నుంచి కాపాడతాయని తెలియజేశారు.  అలాగే మాంసాన్ని తగ్గించడం వలన పర్యావరణం కూడా మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: