ఇక సాధారణంగా చాలా మందికి రోజూ పొద్దున్నే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు. అలాగే కొందరు పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకుని తాగుతారు. అలాగే మరికొందరు అయితే నిమ్మరసం తాగుతుంటారు.ఇక రోజు ఉదయాన్నే ఖాళీ కడపుతో నిమ్మరసం కనుక తాగితే బరువు తగ్గుతారు. అలాగే అనారోగ్య సమస్యలను కూడా తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కాలాలు మారుతున్న సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ నిమ్మరసం ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని ప్రయోజనాలను అందించే నిమ్మరసంను రోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా హాని కల్గుతుందట. సో ఆ టాపిక్ ఏంటో తెలుసుకుందామా.రోజూ నిమ్మరసం తాగడం వల్ల దంతాల ఎనామిల్ అనేది దెబ్బతింటుంది. అలాగే నిమ్మకాయలో ఉండే యాసిడ్ వలన దంతక్షయం సమస్య కూడా ఏర్పడుతుంది. 

ఇక అలాగే నిమ్మరసంను ఎక్కువగా తాగడం వలన గుండెల్లో మంట ఇంకా వికారం వస్తుంది. నిమ్మరసంను రోజూ తాగడం వలన కడుపు నొప్పి కూడా కలుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా ఎక్కువవుతాయి. ఇందులో ఆస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ సి అనేవి పుష్కలంగా ఉంటాయి. దీంతో తరచూ మూత్రవిసర్జన సమస్యను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఎముకలకు చాలా హాని కల్గిస్తుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు కూడా ఇది కారణమవుతుంది.నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వలన ఐరన్ శోషణ కూడా పెంచుతుంది. కానీ ఎక్కువ మోతాదులో విటమిన్ సి ఉండడం వలన శరీరంలో ఐరన్ శాతం అనేది కూడా పెరుగుతుంది. నిమ్మరసంలో ఉంటే సిట్రిక్ యాసిడ్ నోటి పూతలను కూడా మరింత తీవ్రం చేస్తుంది. ఇక అలాగే చిగుళ్ల సమస్యలను ఎక్కువగా కల్గిస్తుంది.కాబట్టి నిమ్మరసం తాగేవారు ఖచ్చితంగా ఇవి తెలుసుకొని తాగండి. లేకుంటే పైన చెప్పిన ప్రమాదాల భారిన పడే అవకాశం చాలా ఎక్కువగా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: