ఆధునిక కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. కొంత మందికి కొన్ని కార‌ణాలుంటాయి. కొంద‌రూ ఎలాంటి వ్యాయామాలు చేయ‌కుండా నిర్ల‌క్ష్యంగా ఉండ‌డం, కొంద‌రూ వ్యాయామాలు చేసినా జంక్ ఫుడ్ తిన‌డం ఇలా ఏదో ఒక విధంగా.. ముఖ్యంగా స‌మ‌య పాల‌న ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల కూడా ఊబ‌కాయం బారిన ప‌డుతుంటారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కుంటూ ఉంటారు. పెరిగిన కొలెస్ట్రాల్ త‌గ్గించాలంటే వ్యాయామంతో ప్ర‌తిరోజు ఈ పండ్ల‌ను తీసుకోవాలి. అధికంగా తీసుకోక‌కూడ‌దు. మితంగా తినాలి. మంచి ఫ‌లితాలుంటాయి. పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు అత్యంత రుచిక‌ర‌మైన పండ్లు. వీటిని సౌంద‌ర్య సాధ‌నాల్లో వాడుతారు. తియ్య‌గా ఉన్న స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండ‌డంతో చ‌ర్మానికి గ్లో తెస్తుంది.

యాపిల్స్

యాపిల్స్ పోష‌కాలు అధికంగా ఉంటాయి. ప్ర‌తిరోజూ ఒక యాపిల్ తింటే డాక్ట‌ర్ వ‌ద్దకు  కూడా వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. పెక్టిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఫైబ‌ర్ కూడా త‌గిన మోతాదులో ఉంటుంది.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

సిట్ర‌స్ పండ్లు

నారింజ‌, నిమ్మ‌, ద్రాక్ష మొద‌లైన‌వి సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లు. ఇందులో సీ విట‌మిన్ అధికంగా ఉంటుంది. ఎక్కువ‌గా చ‌లికాలంలో ల‌భిస్తాయి. ఈ పండ్లు కొలెస్ట్రాల్ త‌గ్గించ‌డంలో ప్ర‌భావవంతంగా ప‌ని చేస్తాయి. విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉన్నందున రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి.

ద్రాక్ష

శీతాకాల‌పు చిరుతిండి కోసం చూస్తున్నారా..? అందుకు ద్రాక్ష బెస్ట్. ఈ చిన్న ఆకుప‌చ్చ మెత్త‌ని పండ్లు రుచిక‌ర‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. ఇవి బ‌రువు త‌గ్గించ‌డానికీ స‌హాయం చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ద్రాక్ష ఎలా స‌హాయ‌ప‌డుతుందో ప‌లు అధ్య‌య‌నాలు నిరూపించాయి.

అవోకాడో

కొలెస్ట్రాల్‌తో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తులు త‌రుచుగా అవొకాడో తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయ‌నే అపోహ‌తో దూరంగా ఉంటారు. కానీ యూఎస్‌డీఏ ప్ర‌కారం.. అవోకాడోలో 0 మిల్లిగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎలాంటి అనుమానం లేకుండా తిన‌వ‌చ్చు. అద‌నంగా ఇది ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల‌ను ఉత్ప‌త్తి చేస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఆల‌స్యం ఈ పండ్ల‌ను తిని వ్యాయామం చేస్తే  మీ ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: