పాలు మరియు పెరుగు : పాలను పెరుగును కలిపి తీసుకోవడం కారణంగా మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం కారణంగా మన శరీరంలో ఎస్ డి టి సమస్య పెరిగే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా పాలు మరియు పెరుగు కలిపి తీసుకోకూడదు.

పెరుగు మరియు ఉల్లిగడ్డ : మన నిత్య జీవితంలో చాలామంది పెరుగుతో పాటు ఉల్లిగడ్డలను తరచు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ రెండింటినీ కలిపి తిన్నట్లయితే మనకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చి చేరుతాయి. ఈ రెండిటినీ తీసుకోవడం కారణంగా ముఖ్యంగా మనకు ఎలర్జీ మరియు వాంతులు అలాగే గ్యాస్ సమస్యలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

పెరుగు మరియు మామిడి : చాలామంది పెరుగుతో మామిడికాయ తొక్కు ను తీసుకుంటారు. పెరుగు మరియు మామిడికాయ కాంబినేషన్ చాలా రుచికరంగా ఉంటుంది. అయితే వీటిని తీసుకోవడం కారణంగా మనకు గ్యాస్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచన చేస్తున్నారు.

పెరుగు మరియు చేప : పెరుగు మరియు చేపల కూర ను చాలా మంది కలిపి తీసుకుంటూ ఉంటారు. వీటి రెండిటి కాంబినేషన్ చాలా రుచికరంగా ఉంటుంది.  అయితే ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం కారణంగా మన శరీరంలో అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి మరియు వాంతులు తదితర అనారోగ్య సమస్యలు మనకు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టిపరిస్థితిలోనూ చేప మరియు పెరుగు కాంబినేషన్ ను అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే ఆస్పత్రి ఫాలో అవ్వడం మాత్రం పక్క. పైన చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి: