తెలంగాణ స్టేట్ లో క‌రోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ప‌లువురు ఉన్నతాధికారులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినిప్ర‌ముఖులు.. వీరే కాకుండా రోగాల‌ను న‌యం చేసే వైద్యులు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. గ‌త రెండేండ్ల కాలంలో వైద్యులు ఈ రేంజ్ లో క‌రోనా బారిన ప‌డ‌డం థ‌ర్డ్‌వేవ్ లోనే అని చెప్పుకోవ‌చ్చు. తాజాగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌ల‌మే సృష్టిస్తున్న‌ది.

కొవిడ్‌-19 రాష్ట్రంలోకి తొలి కేసు న‌మోదు అయిన‌ప్ప‌టి నుంచి గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవ‌లు మ‌రువ‌లేనివి. క‌నిపించ‌ని మ‌హ‌మ్మారిపై ముందుండి పోరాటం చేస్తూ ఉన్నారు. గాంధీని కొవిడ్ ఆసుప‌త్రిగా మార్చి సేవ‌లు అందిస్తుంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇదే స‌మయంలో పెద్ద సంఖ్య‌లోనే డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది కొవిడ్ బారిన ప‌డుతున్నారు. మిగ‌తా వారిలో కూడా గాంధీలో న‌మోద‌య్యే కేసులను చూసి భ‌యాందోళ‌న మొద‌లైంది. తాజాగా మ‌రొక 120 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయిన‌ది.

అయితే వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు ఉండ‌గా.. 38 మంది హౌస్ స‌ర్జ‌న్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాక‌ల్టీ ఉన్నారు. మ‌రికొంద‌రూ వైద్యులు, వైద్య సిబ్బందికి సంబంధించిన క‌రోనా టెస్ట్ రిపోర్టులు కొన్ని రావాల్సి ఉన్న‌ది. క‌రోనా బాధితుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవకాశ‌ముంద‌ని పేర్కొంటున్నారు. గాంధీ ఆసుప‌త్రిలో వైద్య‌సిబ్బంది, రోగుల‌లో ఆందోళ‌న ప్రారంభ‌మైంది. మ‌రొక వైపు హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా గాంధీ ఆసుప‌త్రికి వ‌స్తుండ‌టంతో గాంధీ ఆసుప‌త్రి పేరు చెబితేనే స్థానికంగా ఉన్న‌టువంటి వారు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మ‌రొక వైపు తెలంగాణ‌లో క‌రోనా నేప‌థ్యంలో విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. మ‌రొక‌వైపు తెలంగాణ‌లో మిని లాక్‌డౌన్ ఉంటుంద‌ని కూడా ప్ర‌చారం కొన‌సాగుతోంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఇవాళ కేసీఆర్ క్యాబినెట్ స‌మావేశం జ‌రుగుతుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మ‌రొక‌వైపు ప‌క్క రాష్ట్రమైన ఏపీలో రేప‌టి నుంచి నైట్ క‌ర్ప్యూ విధించ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: