ఉన్నట్టుండి బరువు తగ్గిన పెరిగిన.. లేదా మహిళలకు పిల్లలు పుట్టిన తర్వాత పొట్ట పైన ఎక్కువగా స్ట్రెచ్ మార్క్స్ వంటివి వస్తూ ఉంటాయి.. మహిళలు ఏదైనా చీరలు కట్టుకునేటప్పుడు ఈ చారలు చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు మహిళలు. అయితే వీటిని తొలగించుకోవాలంటే మాత్రం ఎన్నో కాస్ట్యూమ్ సర్జరీలు వంటివి చేయించుకోవాల్సి ఉంటుంది.అయితే అలాంటి వాటి జోలికి ఎప్పటికీ వెళ్ళకండి.. ఎందుకంటే అవి చాలా ప్రమాదమైనవి కాబట్టి.అయితే మగవారిలో ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కానీ ఈ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. కేవలం ఇవ్వ పురుషులు అయితే ఇలాంటి వాటికి కాస్త ఫీలవుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందాలంటే ఇలా చేస్తే సరి.

1). ఆలోవెరా:
కలబంధ చర్మ సంబంధిత వ్యాధులన్నిటినీ చెక్ పెట్టేస్తుంది. స్కిన్ కాంతివంతంగా చేసే గుణం కలబంద కి ఉంటుంది. పొట్ట పై ఉన్న చారలకు విరుగుడుగా ఈ కలబంద పనిచేస్తుంది. కలబంద గుజ్జును కాస్త ఆ స్ట్రిచ్  మార్క్ పైనా  పట్టించి కొద్దిసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి

2). కోకోవా బటర్:
చర్మ సౌందర్యాన్ని కోకోవా బటర్ ఇనుమడింపచేస్తుంది.. దీంతో రాత్రి పడుకునే సమయంలో మసాజ్ చేసుకుంటే అవి తొలగిపోతాయట.

3). ఆముదం నూనె:
జుట్టుకు నిగారింపు రావాలంటే ఆముదం నూనెను వాడుతాము.. అలాగే చర్మం పై రాసినప్పుడు కూడా అలాంటి షైనింగ్ ఏ వస్తుంది కాబట్టి.. స్ట్రెచ్ మార్క్ ఉన్నచోట ఈ ఆముదాన్ని రాస్తే ఫలితం దక్కుతుంది.

4). కీరా- నిమ్మపండు:
నిమ్మ రసం లో ఎసిడిటి ఉండడం వల్ల, చర్మం బాగా పల్చగా అవుతుంది.. ఇక కీర దోసకాయ గుజ్జును.. నిమ్మపండు రసంతో కలిపి స్ట్రెచ్ మార్క్ పైన రాస్తే అవి తగ్గుముఖం పడతాయి.

ఇవన్నీ సహజసిద్ధంగానే దొరికేవి కావున మనం ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: